ఛాన్స్ లు లేక వాచ్ మెన్ గా మారిన బాలీవుడ్ స్టార్ యాక్టర్  

సినిమా అవకాశాలు లేక వాచ్ మెన్ గా మారిన బాలీవుడ్ స్టార్ నటుడు. .

Star Actor Become Watchmen-become Watchmen,bollywood,star Comedian,tollywood

చాలా మంది సినిమా ఇండస్ట్రీలో వెలిగిపోవాలని కలలు కంటూ అడుగులు పెడతారు. అయితే ఇక్కడ అవకాశాలు అందుకోవడం ఓ పెద్ద పోరాటం. ఆ అవకాశం వచ్చిన తర్వాత దానిని వినియోగించుకొని గుర్తింపు తెచ్చుకోవడం మరో పెద్ద పోరాటం..

ఛాన్స్ లు లేక వాచ్ మెన్ గా మారిన బాలీవుడ్ స్టార్ యాక్టర్-Star Actor Become Watchmen

ఇలా సినిమా ఇండస్ట్రీలో నిత్యం బ్రతుకుతో గుర్తింపు కోసం యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇలా సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణించాలని వచ్చిన చాలా మంది ఒకటి అర అవకాశాలకి పరిమితం అయ్యి తరువాత బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పనిలో చేరిన వారు ఉన్నారు. అలాగే బిక్షాటన మొదలెట్టిన వారు ఉన్నారు.

తాజాగా బాలీవుడ్ కి చెందిన స్టార్ యాక్టర్ పరిస్థితి ఇప్పుడు అలాగే అయ్యింది. గతంలో అక్షయ్ కుమార్ సినిమాలో కమెడియన్ గా రాణించిన సవి సిద్దు తరువాత చాలా సినిమాలలో నటించాడు. అయితే ఊహించని విధంగా అతనికి అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్ధికంగా కుటుంబాన్ని లాగడం భారం అయ్యింది.

దీంతో తప్పని సరి పరిస్థితిలో సవి సిద్దూ వాచ్ మన్ గా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇప్పుడు సవి సిద్దు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో బాలీవుడ్ కు చెందిన పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.