ఏళ్ళు గడిచినా గాని యావత్ దక్షణ భారత దేశం మర్చిపోలేని మిస్టరీ మర్డర్ ప్రముఖ లక్ష్మి కాంతం గారిది.దక్షణాది సినిమాలు అన్నిటికి కేంద్రబిందువుగా మద్రాసు ఉన్న సమయంలో ఆ నగరంలోనే తారల వ్యక్తిగత విషయాలను, రహస్యాలను కలం రూపంలో పొందు పరిచి వార్తల రూపంలో ప్రచురించేవి తమిళ తెలుగు పత్రికలు.
ఆ పత్రికలు నడిపించిన సంపాదకుడు పేరు లక్ష్మి కాంతం. సినిమా తొత్తు అనే పత్రిక ప్రారంభించి తమిళ తెలుగు నటుల జీవితాలలోని రహస్యాలను బట్టబయలు చేసాడు.
తొలి సంచిక నుంచి సంచలనం సృషించిన జర్నలిస్ట్ అయ్యాడు.ఆ తర్వాతనే అసలు లక్ష్మి కాంతం ఎవరు? ఏంటి అనే వెతుకులాట మొదలయింది సినీ తారల మదిలో.దక్షణాది సిని రంగం మీద ఆధారిటీ అయిన రాన్డర్ రాన్ రాసిన దానిని బట్టి చూస్తే లక్ష్మి కాంతంది ఆర్థికంగా ఉన్నత కుటుంబం కాదు చదువుకోవాలి అని ఉన్నాగాని కాలేజ్ స్థాయి మాత్రం దాటలేదు.తెలివితేటలు కూడా చాలా ఎక్కువ.
చదువుకోవాలని మదిలో ఉన్నాగాని ఆర్ధికంగా చదువుకోలేని పరిస్థితి.దీనితో లాయర్ అవ్వాలని తన కోరికను పక్కన పెట్టి కోర్టు పక్షిగా మారాడు.
ఇదంతా బ్రిటిష్ పాలకులు మనల్ని పాలిస్తున్న రోజుల్లో జరిగింది.
కోర్టు కేసులను తీసుకుని వచ్చి లాయర్లకు అప్పగించి కమిషన్ తీసుకునేవాడు.
అవసరాన్ని బట్టి దొంగ రిపోర్టులు, దొంగ సంతకాలు కూడా చేసేవాడట.దొంగ సంతకాలు చేయడంలో నైపుణ్యం కూడా సంపాదించాడు.చివరకి ఒక దొంగ సంతకం కేసులో దొరికిపోయాడు.1935 వ సంవత్సరంలో ఆయనకి జైలు శిక్ష పడింది.అయితే పోలీసుల కళ్లు కప్పి మరి పారిపోయాడు.ఎలాగోలా పట్టుకుని ఏడు ఏళ్లపాటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపారు.అక్కడ కూడా తప్పించుకుని పారిపోవడానికి చాలా రకాల ప్రయత్నాలే చేసి దొరికిపోయాడు.లక్ష్మి కాంతం చాలా ప్రమాదకరమైన వ్యక్తి కావడంతో అతనిని అండమాన్ నికోబార్ దీవులకు పంపారు.
లక్ష్మి కాంతం అదృష్టం బాగుండి అప్పుడే రెండవ ప్రపంచం యుద్ధం మొదలయింది.అండమాన్ ద్విపాలను జపాన్ ఆక్రమించుకుంది.
బ్రిటిష్ పాలకులు బంధించిన అందరిని జపాన్ ప్రభుత్వం విడుదల చేసింది.ఆ విధంగా అండమాన్ నుంచి బయటపడి 1940 చివరలో తిరిగి చెన్నై చేరుకున్నారు.
ఆ తరువాత తన తెలివితేటలకు జర్నలిస్ట్ వృత్తి అయితే బాగుంటుందని అనుకున్నాడు.నాటి మద్రాసు వాతావరణంలో డబ్బులు సంపాదించుకునే రంగం ఏదన్నా ఉంది అంటే అది సినీ రంగం అని భావించాడు.ఇతరత్రా చిన్న చిన్న కధనాలు తయారు చేసుకున్నాగాని సినీ రంగంలో ఉన్న చీకటి కోణాలను తన సంపాదనకు అనుగుణంగా మార్చుకోవాలని అనుకుని “సినిమా తొత్తు” అనే తమిళ పత్రికను 1943 లో స్థాపించాడు.అందులో తెలుగు వాళ్ళ గురించి కూడా ఒక కాలమ్ రాసేవాడు.
తారల వ్యక్తిగత జీవితాల మీద పాఠకులకు ఆసక్తిని పెంచే క్రమములో కొంతమంది సినీ ప్రముఖలకు కోపం వచ్చింది.కానీ వాళ్ళు చేసేది ఏమి లేదు.ఎందుకంటే లక్ష్మి కాంతం చాలా జాగ్రత్తగా నిజాలను నిక్కు తేల్చి మరి రాసేసేవారు.అయితే లక్ష్మి కాంతం రాసిన వార్తలు కొన్ని అవాస్తవం వాటిని నమ్మొద్దు అని కొన్ని సార్లు నటులు అన్నగాని వాళ్ళ మాటలు నమ్మి ప్రచురించడానికి వేరే పత్రికలు ఏమి లేవు.
దీనితో లక్ష్మి కాంతం సినీ పత్రిక బాగా ఊపు అందుకుంది.దానితో పాటే అతనికి చివరి రోజులు కూడా మొదలయిపోయాయి.
రాను రాను లక్ష్మి కాంతం కి దుర్బిద్ది మొదలయింది.లక్ష్మి కాంతం సేకరించిన సమాచారం మొత్తం ప్రకటించే వాడు కాదు.
ఆయన దగ్గర ఉన్న వార్తలను, ఫోటోలను తారలకు చూపించేవాడు వాటిని ప్రచురించకుండా ఉండాలి అంటే నేను అడిగిన డబ్బులు ఇవ్వాలి అని చెప్పి తారలను బెదిరించేవాడు.అయితే చాలా మంది యాక్టర్లు డబ్బులు ఇచ్చి వాళ్ళకి సంబందించిన కథనాలను ఆపగలిగారు.
అయితే తమిళ, తెలుగు నటులు అందరు కలిసి తమిళ తొత్తు పత్రికపై ఫిర్యాదు చేయగా అప్పుడు దాన్ని ఆపేసారు.కానీ తారల దగ్గర నుండి డబ్బులు మరిగిన లక్ష్మి కాంతం మళ్ళీ హిందూ దేశ్ అనే మరో పత్రిక ప్రారంభించాడు.
సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ కూడా పెట్టాడు.మళ్ళీ ఈ పత్రికపై కూడా కొంతమంది నటులు కోర్టులో కేసు వేశారు.
ఆ కేసులను ఎదుర్కొనేందుకు లాయర్లను కూడా పెట్టుకున్నాడు లక్ష్మీకాంతం.కానీ లక్ష్మి కాంతం తెలివిగా కోర్టు నుండి కూడా బయట పడే సూచనలు ఉండడంతో, అతన్ని చట్ట పరంగా ఏమి చేయలేక చంపేయడమే మంచిందని భావించారు కొంతమంది నటులు.
1944, నవంబర్ లో లక్ష్మికాంతం ఒక కేసు విషయంలో బేబెరులో ఉన్న తన లాయర్ తో పోట్లాడి పూరసవాకలో ఉన్న తన ఇంటికి రిక్షాలో బయలుదేరాడు.ఆరోజు ఆ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.పోలీసులు కూడా ఈ హత్యకు సహకరించారని కొన్ని వార్తల్లో వచ్చాయి.డబ్బు తీసుకుని ట్రాఫిక్ మళ్ళించారు అని ఆ తర్వాత తేలింది.పట్టపగలు రిక్షా లో వస్తున్న లక్ష్మీకాంతం పై కొందరు దుర్మార్గులు దాడిచేసి కత్తులతో పొడిచారు.అలా రక్తం మడుగులోనే పరిగెట్టుకుంటూ తిరిగి తన లాయర్ ఇంటికి వెళ్ళాడు.
ఆ లాయరు తన ఫ్రెండు ఒకతను పంపించి రిక్షా లో గవర్నమెంట్ హాస్పటల్ కి వెళ్ళమని చెప్పాడు.లక్ష్మీకాంతం మెదడు అంత బాధలో కూడా చాలా చురుగ్గా పనిచేసింది.
బెబేరి పోలీస్ స్టేషన్ దగ్గర రిక్షా ఆపి తన మీద జరిగిన దాడిని, దాని వెనుక వున్నా కుట్రను గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు.పోలీసులు హాస్పిటల్ లో చేర్చగా మరుసటి రోజు మరణించాడు.
అయితే లక్ష్మి కాంతం మర్డర్ ఈరోజుకి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.!
.