10 రూపాయిలే చీర! తొక్కిసలాట ఆపై దొంగలు పడి దోపిడీ!

పది రూపాయిలకే చీర అంటే ఎవరికైన ఆశ వుంటుంది.వ్యాపార సంస్థలు తమ వ్యాపారభివృద్ధి కోసం వస్త్ర దుకాణాల యజమానులు ఇలాంటి ఆఫర్స్ ని పెడుతూ వుంటారు.

 Stampede Cmr Shopping Mall In Siddipet-TeluguStop.com

అలాంటి ఆఫర్స్ ప్రకటిస్తే సామాన్య, మధ్యతరగతి మహిళలు భారీ సంఖ్యలో ఎగబడతారు.ఇప్పుడు అలాంటి పరిస్థితి సిద్ధిపేటలో జరిగింది.

సిద్ధిపేటలో సిఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం పది రూపాయిలకే చీర అని ప్రకటించడంతో గత రెండు రోజులుగా ఆ చుట్టు పక్కల మహిళలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు.అయితే చీరల కోసం వచ్చే మహిళల కోసం షాపింగ్ మాల్ యాజమాన్యం ఎలాంటి రక్షణ చెర్యలు తీసుకోలేదు.

దానికి తోడు కేవలం గంట మాత్రమె ఆఫర్ ఉంటుందని ప్రకటిందింది.

ఈ నేపధ్యంలో ఈ రోజు ఉదయం సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర భారీ సంఖ్యలో మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

అదే సమయంలో షాపింగ్ సిబ్బంది ఒక్కసారిగా తలుపులు తెరవడంతో మహిళలు షాపింగ్ మాల్ లోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు.దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.దాంతో పాటు జేబుదొంగలు వారి చెతికి పని చెప్పి, మహిళల మేడలో ఆభరణాలు తష్కరించారు.ఈ తొక్కిసలాటలో పలువురు మహిళలకి గాయాలు కావడం జరిగింది.

దాంతో కొంత మంది మహిళల మేడలో ఆభరణాలు దొంగలు దోచేయడంతో వారు రోడ్డు మీదక్కొచ్చి లబోదిబో అంటూ ఏడవడం మొదలుపెట్టారు.ఈ ఘటనతో గాయాలు తగిలిన వారిని హాస్పిటల్ కి తరలించగా.

ఆభరణాలు పోగొట్టుకున్నవారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube