కేసీఆర్ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనా ? స్టాలిన్ ఏం చెప్పాడు ?  

Stalin Urges Kcr To Support Congress-congress,dmk Chief,kcr,rahul Gandhi,stalin,కేసీఆర్,స్టాలిన్‌

జాతీయ రాజకీయాల్లో ఏదో చేసేద్దామని అన్ని రాష్ట్రాలు తిరుగుతూ, అన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ పర్యటనలు చేస్తున్నాడు. ప్రాంతీయ పార్టీలన్నీ ఫెడరల్ ఫ్రంట్ లో చేరాల్సిందిగా అభ్యర్దిస్తున్నాడు. అయితే కేంద్రంలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండడంతో కేసీఆర్ బాటలో నడిచేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు..

కేసీఆర్ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనా ? స్టాలిన్ ఏం చెప్పాడు ? -Stalin Urges KCR To Support Congress

పైపెచ్చు ఆయనకే ఫలానా పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా హితబోధ చేస్తుండడం కేసీఆర్ కు మింగుడు పడడంలేదు. ఈ విధంగానే డీఎంకే అధినేత స్టాలిన్ కేసీఆర్ కు హితబోధ చేశారట. తమకు ఏ పరిస్థితి ఎదురయినా కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు ఉంటుంది అంటూ తేల్చిచెప్పేశారట.


గంట పాటు దేశ రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. ప్రస్తుత ఎన్నికల ట్రెండ్స్ ఫలితాల తర్వాత ఎటువంటి మార్పు ఉండబోతుందో కేసీఆర్ విశ్లేషించి ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా మారితే రాష్ట్రాలకు మరింత బలం కలిగేలా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోచించవచ్చంటూ చెప్పారట. అయితే ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తిని స్టాలిన్ మెచ్చుకున్నారట.

ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడుఫెడరల్ ఫ్రంట్ విషయంలో సానుకూల ప్రకటన చేయలేనని మొహమాటం లేకుండా చెప్పేశాడట. తాము కాంగ్రెస్‌తోనే కలిసి సాగుతామని చెప్పినట్లు డీఎంకే వర్గాలు మీడియాకు సమాచారం అందించాయి

కాంగ్రెస్‌ విషయంలో తమ వైఖరి మారబోదని, రాహుల్ ని ప్రధానిగా చూడడమే తమ కర్తవ్యం అంటూ చెప్తూనే, కేసీఆర్ ను కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా స్టాలిన్ కోరినట్టు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. చివరిలో ఫలితాల తర్వాత అవసరమైతే కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారట. అయితే ఈ సమాధానం వస్తుందని ముందుగా ఊహించని కేసీఆర్ స్టాలిన్ వాక్యాలతో నొచ్చుకున్నారట.

తాను ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు ఇమ్మని కోరితే ఆయన కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వమని చెప్తాడని ఊహించలేదని కేసీఆర్ తన సన్నిహితుల దగ్గర ఆవేదన చెండాడట. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తాపడ్డావులే బుల్ బుల్ పిట్టా అంటే ఇదేమరి.