రంగంలోకి దిగిన డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్..!!  

stalin-the-dmk-party-leader-who-entered-the-field stalin, dmk,palani swamy,tamilnadu elections ,tami nandu cm palni swammy - Telugu Dmk, Palani Swamy, Stalin, Tamilnadu Elections

మరో రెండు నెలల్లో  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  వరుసగా రెండుసార్లు అన్నాడీఎంకే పార్టీ గెలవడంతో  ఈసారి కచ్చితంగా  అన్నాడీఎంకే ఓడిపోవడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

TeluguStop.com - Stalin The Dmk Party Leader Who Entered The Field

ఎందుకంటే తమిళ ఓటర్లు ఎప్పటికప్పుడు ఒకే పార్టీ ని రెండుసార్లు గెలిపించే పరిస్థితి ఉండదని, ఇప్పటికే అన్నాడీఎంకే కి రెండుసార్లు అవకాశం ఇవ్వటం తో వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీ అధికారంలోకి రావటం గ్యారెంటీ అని పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న సర్వేలలో చాలావరకు డీఎంకే పార్టీ  అధికారంలోకి వస్తుందని ఫలితాలు వస్తున్నాయి.
 

పరిస్థితి ఇలా ఉండగా తాజాగా  డీఎంకే పార్టీ అధినేత  స్టాలిన్  ఎన్నికల నేపథ్యంలో  ప్రచారానికి రంగంలోకి దిగారు.  దీంతో ఎప్పటిలాగానే సాంప్రదాయబద్ధంగా రెండు జంటలకు  వివాహం జరిపించి ప్రచారం మొదలు పెట్టారు.

TeluguStop.com - రంగంలోకి దిగిన డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్..-General-Telugu-Telugu Tollywood Photo Image

  ప్రచారంలో అధికార పార్టీ అన్నాడీఎంకే ని ముఖ్యమంత్రి పళనిస్వామి ని టార్గెట్ చేసి భారీ స్థాయిలో డైలాగులు వెయ్యటం స్టార్ట్ చేశారు.ఎన్నికలు మరో రెండు నెలల్లో వస్తున్న తరుణంలో పలని స్వామికి పేదవాళ్లు గుర్తొచ్చారా అని సెటైర్లు వేశారు.

అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తమిళ ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని స్టాలిన్ ప్రచారంలో దూకుడుగా రాణిస్తున్నారు.

.

#Palani Swamy #Stalin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు