ఎవరు? చిరంజీవికి ఇద్దరు చెల్లెల్లు కదా? వాళ్లలో ఒకరి కొడుకులే కదా సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.అని మీకు సందేహం రావచ్చు.
కానీ ఇప్పుడు చెప్పేది రియల్ చెల్లి గురించి కాదు రీల్ క్యారెక్టర్ గురించి చెప్తున్నాం.రీల్ క్యారెక్టర్ ఏ సినిమాలో అని అనుకుంటున్నారా? అదేనండీ 2006లో విడుదలైన స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా నటించింది.చెల్లిగా అంటే చెల్లిగా కాదు సునీల్ పక్కన పెళ్లికూతురులా నటించింది.ఇక ఈ సినిమాలో నటించింది చిన్న పాత్ర అయినా కూడా సీరియల్స్ లో మాత్రం మంచి పాత్రల్లోనే నటిస్తుంది.
విలన్ గా, వదినగా, అక్కగా, అమ్మగా ఇలా అన్ని పాత్రల్లో నటిస్తుంది.అవును చెప్పడం మర్చిపోయా కదా.ఆమె పేరు లిరిషా కూనపరెడ్డి.అమ్మనా కోడలా, అక్క చెల్లెల్లు వంటి సీరియల్స్ లో నటించింది.
ఇంకా ఎన్నో సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.కేవలం సీరియల్స్ లో మాత్రమే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.
ప్రస్తుతం మెకాసురి అనే వెబ్ సిరీస్ లో కూడా లిరిష కూనపరెడ్డి నటించారు.ప్రస్తుతం ఆ సిరీస్ జీ5లో ఉంది.
ఇలా సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన లిరిషా కూనపరెడ్డి పెళ్లి చేసుకొని ఎంతో చక్కని జీవితం అనుభవిస్తుంది.ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్న లిరిషా కూనపరెడ్డి వెబ్ సిరీస్ లోను నటిస్తూ తన ట్యాలెంట్ నిరూపించుకుంటూ ముందుకెళ్తుంది.
ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది లిరిషా కూనపరెడ్డి.