ఇదేం వింత ఆచారం : అక్కడ పెళ్లి చేసుకోవాలంటే రోజుకి 20 సార్లు... వామ్మో...

టెక్నాలజీ పరంగా ప్రపంచం ఎంతో ముందుకు సాగిపోతున్నప్పటికీ చాలా దేశాలు ఇప్పటికీ మూఢ నమ్మకాలు, వింత ఆచారాలు వంటివి పాటిస్తూ వెనుకబడి ఉన్నాయి.మామూలుగా పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా సరే యువతి లేదా యువకుడికి తమకు ఉన్నటువంటి అర్హతలను బట్టి ఒకరికిఒకరు ఈడు జోడిగా సరిపోతారో లేదో మొదటగా చూస్తారు.

 Stairs Amava Tribal Bullet Ant Ritual News, Stairs Amava Tribals News, Bullet An-TeluguStop.com

 కానీ అక్కడ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం రోజుకు 20 సార్లు చీమలతో కుట్టించుకుని తట్టుకోగలిగితే మాత్రమే పెళ్లికి అర్హుడని నిర్ణయిస్తారు.ఇప్పుడు ఆ వింత ఆచారం గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం…

ప్రపంచంలోనే అతిపెద్ద అడవి అయినటువంటి అమెజాన్ అడవులు గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

 అయితే ఈ అమెజాన్ అడవి పరివాహక ప్రాంతంలో సెటైర్ అమావా అనే ట్రైబల్ తెగకి చెందిన ప్రజలు  నివాసముంటున్నారు.అయితే వీరు నదీ పరివాహక ప్రాంతంలో ఉండడంతో ఎలాంటి టెక్నాలజీ సదుపాయాలు అందుబాటులో ఉండవు.

 దీంతో వీరు కేవలం తమ మనుగడ సాధించేందుకు చేపలు పట్టడం, తినడానికి కావలసినటువంటి ధాన్యాలను పండించుకోవడం వంటివి మాత్రమే చేస్తారు. ఈ తెగల ప్రజలు తమ పూర్వీకుల ఆచారాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు.

 ఇందులో వింత ఏముందని అనుకుంటున్నారా… అక్కడికే వస్తున్నా…

ఈ తెగలో ఎవరైనా యువకుడు యువతిని పెళ్లి చేసుకోవాలంటే అతడు ముందుగా ఓ కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే ఆ కఠిన పరీక్ష ఏమిటంటే బుల్లెట్ యాంట్ రిచ్యుల్.

ఇందులో బుల్లెట్ చీమలుగా పేరు పొందిన రాకాసి చీమలను ఒక గ్లౌజులో నింపుకుని సుమారు 10 నిమిషాల పాటు చేతులకు తగిలించుకోవాలి.ఇలా రోజుకి దాదాపుగా 20 సార్లు చేస్తేనే ఆ యువకుడికి పెళ్ళి చేసుకునేందుకు అర్హత ఉందని నిర్ణయిస్తారు.

దీంతో ఇలా ఎందుకు చేస్తున్నారని కొందరు టూరిస్టులు స్థానిక ప్రజలను అడగ్గా తుపాకీతో కాల్చినప్పుడు తూటా మనిషి శరీరానికి తగిలితే ఎంత నొప్పి కలుగుతుందో ఈ చీమల కుట్టినప్పుడు కూడా అంతే నొప్పి తగులుతుందని కాబట్టి ఈ చీమల నొప్పిని తట్టుకునే వ్యక్తి కి తన భార్య పెట్టేటువంటి కష్టాలను కూడా తట్టుకోగలడని వారు నమ్ముతారట.దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఇదేం దిక్కుమాలిని ఆచారమని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube