స్టైన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ మిలమిల మెరవాలంటే....బెస్ట్ టిప్స్

కిచెన్ లో ఎక్కువగా స్టైన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ ని వాడుతూ ఉంటాం.అవి మిలమిల మెరవకుండా మురికిగా ఉంటే చూడటానికి అసహ్యంగా ఉండటమే కాక ఏదైనా వంట చేయాలన్న చికాకు కలుగుతుంది.

 Stainless Steel Appliances Cleaning Tips-TeluguStop.com

స్టైన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.కాబట్టి వీటిని సరైన పద్దతిలో మెయిన్ టైన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

కాబట్టి ఇప్పుడు స్టైన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ ని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం.

స్టైన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ ని సోప్ వాటర్ తో శుభ్రం చేసాక డస్టింగ్ స్ప్రే తప్పనిసరిగా వాడాలి.

ఈ విధంగా చేస్తే పాత్రలు మిలమిల మెరుస్తాయి.

క్లబ్ సోడాని ఉపయోగించి మంట కారణంగా వచ్చే మరకలు,చారలు తొలగించుకోవచ్చు.

స్టెయిన్ లెస్ స్టీల్ పై కొన్ని చుక్కలు బేబీ ఆయిల్ ని వేసి బాగా రుద్దితే వాటి మీద ఉన్న మరకలు సులభంగా తొలగిపోయి మిలమిల మెరుస్తాయి.

వైట్ వినేగార్ ని స్ప్రే బాటిల్ లోకి తీసుకుని స్టైన్ లెస్ స్టీల్ అప్లయన్సెస్ పై స్ప్రే చేసి మెత్తని క్లాత్ తో తుడిస్తే మంచి ఫినిషింగ్ వస్తుంది.

అలాగే వెనిగర్ స్టైన్ లెస్ స్టీల్ అప్లయన్సెస్ పై ఉండే మురికిని కూడా తొలగిస్తుంది.

చాలా కాలం పాటు పేరుకుపోయిన మరకలని తొలగించేందుకు టూత్ బ్రష్ బాగా సహాయపడుతుంది.

తడి టూత్ బ్రష్ తో ఎండిపోయి పాత్రలకి అంటుకుపోయిన ఆహారం, దుమ్ము లేదా మిగతా మెటీరియల్ ని బాగా రుద్దాలి.ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube