వేదిక దిగి అద్భుత ప్ర‌సంగం.. ఉండ‌వ‌ల్లిపై ట్రోల్స్ ఈ రేంజ్‌లోనా !  

రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌.తాజాగా మ‌రోసారి వైసీపీ స‌ర్కారుపై త‌న‌విమ‌ర్శ‌ల బాణాల‌ను ఎక్కు పెట్టారు.

TeluguStop.com - Stage Down Undavalli Superb Speech Trolls Started On Media

అయితే పైకి ఇవి విమ‌ర్శ‌లుగానే క‌నిపిస్తున్నా జ‌‌గ‌న్‌పై ఆయ‌న‌కున్న అవ్యా జ‌మైన ప్రేమ‌కు తార్కాణంగా ఉన్నాయ‌నేది వాస్త‌వం.వైఎస్ కుమారుడి ప్ర‌భుత్వంపై నిజానికి ఉండ‌వ‌ల్లికి ఎక్క‌డా వ్య‌తిరేక‌త లేదు.

అయితే ఆయ‌న జ‌రుగుతున్న వాస్త‌వాల విష‌యంలో జ‌గ‌న్‌ను అలెర్ట్ చేస్తున్నారు.నిజానికి ఆయ‌న చెబుతున్న పాయింట్లు, కేంద్రాన్ని నిల‌దీయాల‌ని చేస్తున్న సూచ‌న‌లు మంచివే.అయితే ఉండ‌వ‌ల్లి మీడియా మీటింగుల‌పై ఆస‌క్తిక‌ర కామెంట్లు వెలుగు చూస్తున్నాయి.

TeluguStop.com - వేదిక దిగి అద్భుత ప్ర‌సంగం.. ఉండ‌వ‌ల్లిపై ట్రోల్స్ ఈ రేంజ్‌లోనా -Political-Telugu Tollywood Photo Image

“సార్ మీరు చెబుతున్న‌వి మంచి పాయింట్లే.కానీ, మీరు వేదిక దిగిపోయారు సార్‌.ఇప్పుడు ఎంత చెప్పి నా.ఎన్ని చేసినా.ప‌ట్టించుకునే వారు ఎవ‌రుంటారు? “ అని ఎక్కువ మంది కామెంట్లు చేశారు.అంటే.ఎంపీగా రెండు సార్లు చేసిన ఉండ‌వ‌ల్లి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ పోటీకి దూరంగా ఉన్నారు.అంటే.ఆయ ‌న సామాన్య పౌరుడితో స‌మాన‌మే.

సో.ఎవ‌రు మాత్రం ఆయ‌న చెప్పినవి వింటార‌నే సానుకూల కోణంలో ఎక్కువ మంది కామెంట్ చేశారు.ఇక‌, మ‌రికొంద‌రు.“మీకెందుకు సార్‌.జ‌ర‌గాల్సింది జ‌రుగుతుంది.హాయిగా రెస్ట్ తీసుకోండి!“ అని సూచించిన వారు కూడా క‌నిపించారు.

మ‌రికొంద‌రు మాత్రం.మీరు వైసీపీలో చేరిపోవాల్సింది సార్‌.వైఎస్ ఆత్మ‌కూడా సంతోషించేది అంటూ.వ్యంగ్యాస్త్రాలు సంధించారు.స‌రే! ఇంకొంద‌రు.ఎలాగూ.

ప‌రుషంగా కామెంట్లు చేసే వారు ఉండనే ఉంటారు.ఎలా చూసుకున్నా.

ఉండ‌వ‌ల్లి విష‌యంలో.మాత్రం ఆయ‌న చెబుతున్న విష‌యాలు, కామెంట్ల‌లో ప‌స ఉన్న‌ప్ప‌టికీ.

ప‌ట్టించుకునేవారు.క‌రువ‌య్యార‌నేది తెలుస్తోంది.

ఆయ‌న త‌ట‌స్థంగా ఉన్నాన‌ని చెబుతున్నా.టీడీపీ నాయ‌కులు.

ఆయ‌న‌పై వైసీపీ ముద్ర వేస్తుంటే.వైసీపీ వారు.

త‌మ‌కు ఆయ‌న ప్ర‌తిప‌క్ష‌మ‌నే భావిస్తున్నారు.ఈ ప‌రిణామంతో ఉండ‌వ‌ల్లి ఎంత చించుకున్నా.

ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు.ఆయ‌నే ఎంపీగా ఉండి.

ఉంటే.కొంత ఫ‌లితం ఉండేది.

అయినా ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రిగోల వారిది!!

.

#YS Government #StageDown #UnadavalliArun #Rajamundry #YSRaja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు