వావ్.. బాస్ అంటే నువ్వే గురు.. 83 కోట్ల బోనస్ ను ఉద్యోగులకు పంచిన యజమాని..

చాలా కంపెనీలలో ఉద్యోగస్తులు సంవత్సరం పొడవున శ్రమపడి అది అంతా మరిచిపోయి ఆనందంగా గడిపే రోజుకోసం ఎదురు చూస్తుంటారు అదే బోనస్ ఇచ్చే రోజు.ఉద్యోగులందరూ వారికి ఎంత బోనస్ వస్తుందో లెక్కలు వేసుకోవడం సహజం.

 St Johns Properties 83 Crore Bonus Distributed To The Employees, Employees, La-TeluguStop.com

అయితే వారి అంచనాలకు మించి బోనస్ ఇస్తే ఉద్యోగులు ఎలా సంబరపడిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా ఓ అమెరికన్ రియల్ ఎస్టేట్ కంపెనీ తన ఉద్యోగులకు భారీ బోనస్( Bonus ) ను ప్రకటించి ప్రస్తుతం హాట్ టాపిక్ కా మారింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

Telugu Bonus, Employees, Latest, Maykrantz, St Johns-Latest News - Telugu

సెయింట్ జాన్స్ ప్రాపర్టీస్( St johns properties ) అనే అమెరికన్ కంపెనీ తన ఉద్యోగుల కోసం భారీ బోనస్ ను ప్రకటించింది.కంపెనీలో పనిచేస్తున్న 198 మంది ఉద్యోగులకు యాజమాన్యం దాదాపు పది మిలియన్ డాలర్స్ అంటే.మన కరెన్సీలో 83 కోట్ల బోనస్ ను ప్రకటించింది.

కంపెనీలోని ఒక్కొక్క ఉద్యోగికి సగటున 50 వేల డాలర్స్ వచ్చాయి.ఇది భారత కరెన్సీ లో చూస్తే ఒక్కొక్క ఉద్యోగికి 41 లక్ష రూపాయలు అందినట్లు.

తాము అనుకున్న దాని కంటే ఎక్కువగా రావడంతో కంపెనీ ఉద్యోగులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.మామూలుగా కంపెనీ లాభాలు తీసుకుంటున్నప్పుడు అందుకు సహాయపడిన ఉద్యోగులకు వాటిని బోనస్ రూపంలో ఇస్తే ఉద్యోగులు మరింతగా కష్టపడి కంపెనీ ఆదాయాన్ని పెంచుతారు.

Telugu Bonus, Employees, Latest, Maykrantz, St Johns-Latest News - Telugu

ఈ నేపథ్యంలోనే కంపెనీ యాజమాన్యం మాట్లాడుతూ.మా కంపెనీ విజయాన్ని జరుపుకోవడానికి తాము మా ఉద్యోగులకు ఇంత భారీ మొత్తంలో రివార్డులను ఇచ్చామని., తాము ఇలా ఇచ్చిన బోనస్ తో ఉద్యోగస్తుల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయని తెలిపారు.తమ కంపెనీలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి కృషి అంకితభావానికి తాను కృతజ్ఞత తెలుపుతున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ సెయింట్ జాన్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube