సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.మరి గత ఏడాది మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే వీరి కాంబోలో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి.
ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ కాంబో సెట్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.మహేష్, త్రివిక్రమ్ కాంబోలో SSMB28 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుంది.

ఈ బిగ్గీలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.మరి షూట్ సగం కూడా పూర్తి కాకుండానే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
దీంతో ఈ సినిమా బిజినెస్ కూడా ముందుగానే జరిగిపోతున్నట్టు తెలుస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ నైజాం ఏరియాకు సంబంధించి అప్డేట్ వచ్చింది.నైజాం ప్రాంతానికి ప్రముఖ నిర్మాత, డిస్టిబ్యూటర్ అయిన దిల్ రాజు భారీ మొత్తం ఇచ్చి థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.ఒక్క నైజాం ఏరియానే ఏకంగా 50 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది.
ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ విషయం మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తుంది.
