సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది.
సినిమాలో పూజా హెగ్దే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.మహేష్ తో త్రివిక్రం చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.
అందుకే సినిమా సెట్స్ మీద ఉండగానే బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది.సినిమా డిజిటల్ రైట్స్ కు నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ చేసినట్టు టాక్.
తెలుస్తున్న సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్ ఎస్.ఎస్.ఎం.బి 28వ సినిమాకు దాదాపు 80 కోట్ల భారీ డీల్ ఇచ్చిందట.
సినిమా బడ్జెట్ లో 70 శాతం డిజిటల్ రైట్స్ తోనే వచ్చేలా ఉన్నాయి.మహేష్ త్రివిక్రం సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నాడు.అందుకే నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకే మహేష్ ని ప్రమోట్ చేయాలని చూస్తుంది.మన దగ్గర ఏమో కానీ నెట్ ఫ్లిక్స్ వరల్డ్ వైడ్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది.
అందుకే నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ఈ డీల్ కు చిత్రయూనిట్ ఓకే చెప్పినట్టు టాక్.మొత్తానికి మహేష్ 28వ సినిమా బిజినెస్ లో కూడా దూకుడు చూపిస్తుంది.