పరీక్షా కాలం మొదలవుతుంద! ఎగ్జామ్స్ డేట్స్ రిలీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం!  

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల తేదీల ని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా ప్రకటించారు. .

ఏపీలో పరీక్షా కాలం మొదలవుతుంది. ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీలు పడిన విద్యార్ధులు తమని తాము నిరూపించుకోవడానికి రెడీ అయిపోతున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరవు ఏపీ లో పదవ తరగతి, ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్స్ ని అధికారికంగా రిలీజ్ చేసారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని గంటా మీడియాకి తెలియజేసారు. అలాగే ఈ సారి పదవ తరగతి పరీక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల 21 వేల విద్యార్ధులు హాజరు కానున్నారని తెలియజేసారు.

అలాగే ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని మొత్తం 10 లక్షల మది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలు రాస్తారని తెలియజేసారు. అలాగే ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఎంసెట్ పరీక్షలు ఉంటాయని మే 1 న ఎం సెట్ ఫలితాలు రిలీజ్ చేస్తామని గంటా శ్రీనివాసరావు తెలియజేసారు. మొత్తానికి మే నెల వరకు ఏపీలో విద్యార్ధులు పూర్తిగా పరీక్షా కాలాన్ని ఎదుర్కొబోతున్నారు అని గంటా అధికారికంగా స్పష్టం చేయడం జరిగింది.