డార్లింగ్ తో సినిమా చేసేందుకు పదేళ్ల నుండి వెయిట్ చేస్తున్నా!

Ss Thaman Wait On Movie With Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సౌత్ లో ఏ హీరోకు లేనంత స్టార్ డమ్ దక్కించు కున్నాడు.ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు.

 Ss Thaman Wait On Movie With Prabhas-TeluguStop.com

ఇక ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు అయితే అంతకుమించి అన్నట్టు రూపొందనున్నాయి.ఇక ఈయన సినిమాలో అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తారు.

నటీనటులు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్స్ అంత కూడా ఈయన సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

 Ss Thaman Wait On Movie With Prabhas-డార్లింగ్ తో సినిమా చేసేందుకు పదేళ్ల నుండి వెయిట్ చేస్తున్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Salaar, Aadi Purush, Prabhas, Project, Radhe Shyam, Spirit, Ss Thaman, Ssthaman-Movie

ఈ ఎదురు చూస్తున్న లిస్టులో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఉన్నాడట.ప్రసెంట్ థమన్ చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి.అయితే ప్రభాస్ సినిమాలో అయితే అవకాశం రావడం లేదు.

ఆయన సినిమాలో అవకాశం కోసం థమన్ ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు.ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ప్రభాస్ నటించిన సినిమాలో అవకాశం వచ్చింది కానీ అది వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందని థమన్ చెబుతున్నాడు.

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ తన కెరీర్ లో తక్కువ సమయంలోనే సెంచరీ సినిమాలకు అతి చేరువలో ఉన్నాడు థమన్.కానీ ఇంత బిజీగా ఉన్న కూడా డార్లింగ్ సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడట.

ఈ విషయంపై థమన్ మాట్లాడుతూ.ప్రభాస్ నటించిన రెబల్ సినిమాకు అవకాశం వచ్చింది.

వర్క్ కూడా స్టార్ట్ చేసేసాడట.

కానీ ఆ తర్వాత లారెన్స్ ఆ సినిమాకు సంగీతం అందిస్తానని చెప్పడంతో ఆ అవకాశాన్ని వదులు కున్నానని చెబుతున్నాడు.

ఇక అప్పటి నుండి ఎదురు చూస్తున్న కూడా ఇప్పటికి ప్రభాస్ సినిమాలో అవకాశం రాలేదని మళ్ళీ ఆయన సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా థమన్ చెప్పుకొచ్చాడు.ఇక ఈ విషయం విన్న ప్రభాస్ మరియు దర్శక నిర్మాతలు ముందు ముందు అయినా ప్రభాస్ సినిమాలో అవకాశం కల్పిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.ప్రెసెంట్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి విడుదల చేయబోతున్నారు.అంతేకాదు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను చేస్తున్నాడు.

ఇక సందీప్ వంగ సినిమాలో స్పిరిట్ సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాలు అనౌన్స్ చేసాడు.

#Prabhas #Aadi Purush #Project #SSThaman #Radhe Shyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube