ఆ సినిమాలో సక్సెస్ ఎంజాయ్ చేయలేదంటున్న సంగీత దర్శకుడు..!

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘వకీల్ సాబ్‘.ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

 Thaman Talks About Pawan Kalyan Vakeel Saab Movie , Ss Thaman, Pawan Kalyan, Vak-TeluguStop.com

ఇక ఇందులో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రల్లో నటించారు.బోనికపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష ఈ సినిమాని నిర్మించగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందు రానుంది.ఈ సందర్భంగా సినీ సంగీత దర్శకుడు తమన్ హైదరాబాదులో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.

‘ఒక సినిమాలో పాటలన్నీ హిట్ అయ్యాయి అంటే ఆ క్రెడిట్ సంగీత దర్శకుడు ఒక్కడిదే కాదు.పాటల రచయిత, సింగర్స్, డైరెక్టర్స్, నిర్మాత.ఇలా ప్రతి ఒక్కరికి క్రెడిట్ దక్కుతుంది.ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే ఆ క్రెడిట్ కూడా 24 క్రాఫ్ట్స్ వారిది.ఎవరి పని వారు బాగా చేస్తేనే సినిమా హిట్ అవుతుందని’ తెలిపాడు.

అంతేకాకుండా మ్యూజికల్ సక్సెస్ అనేది చాలా రేర్ గా వస్తుందని, అలా వైకుంఠపురములో పాటలన్నీ బాగా పాపులర్ అయ్యాయని తెలుపగా.

Telugu Crafts, Corona Lock, Dil Raju, Gabbar Singh, Musical, Enjoyed, Pawan Kaly

కరోనా కారణంగా ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు తమన్.ఇక లాక్ డౌన్ తర్వాత వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్, క్రాక్ సినిమాలు అటు మ్యూజికల్ గాను, ఇటు సినీ పరంగా గాను మంచి విజయాన్ని అందుకున్నాయని తెలపగా.పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు తానే సంగీతం అందించాల్సింది.

కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అంటూ చెప్పుకొచ్చాడు తమన్.

మొత్తానికి ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాకు అవకాశం వచ్చిందంటూ దిల్ రాజ్ కి త్రివిక్రమ్ చెప్పడంతో ఈ సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపారు.

ఇక ‘మగువా మగువా, సత్యమేవ జయతే, కంటిపాప’ పాటలకు మంచి స్పందన రావడం వల్ల సంతోషంగా ఉందని.ఇక మగువా మగువా పాటని చిరంజీవి వాళ్ళ అమ్మ తో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

ఇక నేపథ్య సంగీతం హైలెట్ గా అవుతుందంటూ, తాను చేసిన టక జగదీష్, బాలకృష్ణ- బోయపాటి దర్శకత్వంలో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అంటూ.అంతేకాకుండా లూసిఫర్ రీమేక్, అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్, సర్కారు వారి పాట సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడట‌ తమన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube