ఇండియన్ ఐడల్ జడ్జిగా థమన్.. నిజమేనా..!

సోనీ టివిలో గత దశాబ్దానికి పైగానే ప్రసారం అవుతున్న సింగింగ్ షో ఇండియన్ ఐడల్. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ షోను ప్రసారం చేస్తున్నారు నిర్వాహకులు.

 Ss Thaman As Judge For Telugu Indian Idol Details, Indian Idol On Aha,indian Ido-TeluguStop.com

ఈ షోలో ఎంతో మంది పాల్గొనాలని అనుకుంటూ ఉంటారు.కానీ అందరు విజేతలు అవ్వలేరు కదా.ఇప్పటి వరకు మన తెలుగు సింగర్స్ ఈ షోలో పాల్గొని విజేతలుగా ఇద్దరే నిలిచారు.

ఒకరు శ్రీరామ్ చంద్ర కాగా మరొకరు రేవంత్.

వీరిద్దరూ మాత్రమే ఇప్పటి వరకు గెలుపొందారు.అయితే ఈ షోలో గెలుపొందడానికి వీరిద్దరూ కూడా చాలా కష్ట పడ్డారు.

సింగర్స్ లో చాలా మంది ఈ షోకి వెళ్ళాలి అనుకున్నప్పటికీ అందరికి అవకాశం అయితే రాదు.అయితే ఇప్పుడు మన తెలుగులో కూడా ఇండియన్ ఐడల్ పేరుతో  షో స్టార్ట్ చేయబోతున్నారు.

తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ అయినా ఆహాలో ఎప్పటి కప్పుడు వస్తున్న క్రేజీ ఏ రియాలిటీ షో జాబితాలో ఇప్పుడు పాపులర్ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ కూడా చేరబోతోంది.

Telugu Indian Idol Aha, Lv Revanth, Music Thaman, Teluguindian, Thaman-Movie

ఈ షోకి హోస్ట్ గా సింగర్ శ్రీరామ చంద్ర వ్యవహరిస్తుండగా.ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత, ఎల్వి రేవంత్ కూడా ఈ షోలో కన్పించ బోతున్నాడు.అయితే ఈ షోకి సంబంధించి తాజాగా ఒక క్రేజీ బజ్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.

Telugu Indian Idol Aha, Lv Revanth, Music Thaman, Teluguindian, Thaman-Movie

సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ లో తెలుగు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జడ్జ్ గా కనిపించ బోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ షోలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ జడ్జిగా వ్యవహరించ బోతున్నారట.ఈ షో నిర్వాహకులు థమన్ ను దాదాపు కన్ఫర్మ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.ఇక ప్రసెంట్ థమన్ వరుస హిట్ లతో టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు.

మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube