రాజమౌళి మరో మల్టీస్టారర్.. మహేష్ తో పాటు మరో స్టార్ హీరో?

గత ఏడాది 2022, మార్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ హిట్ అందుకున్న పాన్ ఇండియన్ మూవీ ”రౌద్రం రణం రుధిరం”( RRR ).ఈ సినిమా మల్టీ స్టారర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

 Ss Rajamouli's Next With Mahesh Babu Isn't A Multi-starrer,  Ntr ,  Rajamouli ,-TeluguStop.com

ప్రపంచ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా పలు అంతర్జాతీయ పురస్కారాలతో పాటు ఏకంగా ఆస్కార్ అందుకుంది.ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీను మన డైరెక్టర్ రాజమౌళి ( Rajamouli ) తెరకెక్కించడం మన తెలుగు వారికీ గర్వకారణం.

స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan ), యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ సినిమాను భారతీయ సినిమాకు కూడా ఎంతో గర్వకారణం అని చెప్పుకుంటున్నాం.మరి ఇలాంటి భారీ మల్టీ స్టారర్ తర్వాత ఇప్పుడు రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను మహేష్ బాబు ( Mahesh Babu ) తో చేయబోతున్నాడు అనే విషయం తెలిసిందే.

ప్రెజెంట్ ఈ సినిమా ( SSMB29) కోసం స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేస్తున్నారు.ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంత వరకు రానటువంటి కథాంశంతో రాజమౌళి ఈ సినిమా చేయబోతున్నాడు అని ఇప్పటికే టాక్.రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ తో బిజీగా ఉన్నారు.ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా కథ సాగుతుంది అని ఆ మధ్య విజయేంద్రప్రసాద్ చెప్పారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా కూడా మల్టీ స్టారర్ ( Multi-Starrer ) అని తాజాగా ఒక కొత్త రూమర్ వైరల్ అవుతుంది.ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది.తాజాగా ఇది కూడా మల్టీ స్టారర్ సినిమానే అని ఇందులో ఎన్టీఆర్ ( NTR ) కూడా ఒక కీలక రోల్ చేయబోతున్నారు అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.అయితే ఈ రూమర్స్ లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube