ముదిరిన ఆర్ఆర్ఆర్ వివాదం.. రాజమౌళి స్పందన ఏమిటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్లు విడుదల కాగా రెండు టీజర్లు అభిమానుల్లో భారీగా అంచనాలను పెంచాయి.

 Ss Rajamouli Response About Ntr Muslim Getup Issue, Rajamouli, Ntr, Ntr Muslim G-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ ముస్లిం గెటప్ కనిపించడంపై వివాదం అంతకంతకూ ముదురుతోంది.కొందరు రాజమౌళి చరిత్రను వక్రీకరిస్తున్నారని.

కోర్టుకు వెళతామని చెబుతున్నారు.
మరికొందరు రాజమౌళి సినిమా కథ గురించి స్పష్టత ఇవ్వాలని.

లేకపోతే పాత్ర పేరు మార్చాలని కోరుతున్నారు.అయితే గతంలోనే రాజమౌళి ఒక వీడియోలో ఈ సినిమా గురించి స్పష్టతనిచ్చారు.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆర్ఆర్ఆర్ తొలి ప్రెస్ మీట్ సమయంలో నైజాంలో ముస్లిం పాలనలో కొమురం భీమ్ ఉన్నారని.

అల్లూరి సీతారామరాజు క్రిస్టియన్లు అయిన బ్రిటిషర్ల పాలనలో ఉన్నారని.భీమ్, సీతారామరాజు హిందువులు కావడంతో భవిష్యత్తులో కులాలపరమైన సమస్యలు రావొచ్చేమో అని ఒక వ్యక్తి రాజమౌళిని ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ కథను ఎక్కడి నుంచి ఎక్కడికైనా లింక్ చేయవచ్చని.మనం సిన్సియర్ గా కథ చెబుతున్నామా.? లేదా.? అనేది మాత్రమే పాయింట్ అని విమర్శల గురించి తాను ఎక్కువగా ఆలోచించనని.వివాదాలు అనేవి సహజంగా వస్తాయని పేర్కొన్నారు.గతంలో అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య సినిమాలు తీసే సమయంలో కూడా ఇలాంటి వివాదాలు వచ్చాయని వెల్లడించారు.

అయితే మరోమారు ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై రాజమౌళి స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందని కొంతమంది చెబుతుంటే మరి కొందరు మాత్రం రాజమౌళికి ఎవరి మనోభావాలు దెబ్బ తీసే ఉద్దేశం లేదని సినిమాలో ఏం చూపించాడో తెలియకుండా వివాదాలు సృష్టించడం సరికాదని చెబుతున్నారు.కొందరు ఆదివాసీలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తామని చెప్పడంతో రాజమౌళి ఈ వివాదానికి ఏ విధంగా ముగింపు పలుకుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube