ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి సరికొత్త ప్లాన్.. అది ఏంటంటే?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

 Ss Rajamouli Ready With New Rrr Promotions Plan , Raja Mouli , Rrr , Ram Charan-TeluguStop.com

ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఆలియా భట్ సీత పాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ లు,పాటలకు, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఆర్ఆర్ఆర్ సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేయడానికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.తాజాగా అప్డేట్ ప్రకారం మార్చి 1 నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి ఈ సినిమా విడుదల అయి ఉండేది.కానీ కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా విడుదల తేది మరొకసారి వాయిదా పడింది.జనవరి 7న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ మార్చి 25న డేట్ ఫిక్స్ చేశారు.రిలీజ్ డేట్ కి అనుగుణంగా ప్రమోషన్స్ ఈవెంట్ ను ప్లాన్ చేసుకుంటున్నారు రాజమౌళి అండ్ టీమ్.

ఈ నేపథ్యంలోనే తెలుగులో పెద్ద పెద్ద ఈవెంట్స్ నిర్వహించాలి అని అనుకుంటుండగా.అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మార్చి తొలి వారంలో ప్రకటించనుంది చిత్ర బృందం.ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.హీరో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు.

అలాగే ఇందులో శ్రియ, అజ‌య్ దేవ్‌గ‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube