గర్వంగా చెప్పుకునే సినిమా ఇది : రాజమౌళి

తన సినిమాలతో సంచలన విజయాలను దక్కించుకోవడమే కాదు ఎదుటివారి విజయాలను కూడా అదే విధంగా ఎంకరేజ్ చేసి ఎంజాయ్ చేసే రాజమౌళి ఈరోజు రిలీజ్ అయిన తన స్నేహితుడు చంద్రశేఖర్ యేలేటి మనమంతా సినిమా చూశారు.ఈ సినిమా కోసం బాహుబలి షూటింగ్ ఓ రోజు బ్రేక్ ఇచ్చి మరి ఏర్పాట్లు చేసుకున్న జక్కన్న సినిమా చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని వెళ్లడించారు.

 Rajamouli About Manamantha Movie-TeluguStop.com

మనమంతా సినిమా చందూ లైఫ్ లో ఓ క్లాసిక్ గా మిగిలిపోతుందని అన్న రాజమౌళి యాక్టర్స్ దగ్గర నుండి నటన తీసుకోవడంలో చందుని నిష్ణాతుడని అన్నారు.

ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి పాత్ర నవ్వించి ఏడిపించేలా చేశాయని అన్నారు.

సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం మొత్తం గర్వంగా మనమంతా సినిమా చేశాం అని చెప్పుకోవచ్చని అంత గొప్ప సినిమా ఇదని అన్నారు.మరి రాజమౌళి ఈ రేంజ్ లో పొగిడేశాడంటే సినిమా కచ్చితంగా విషయం ఉన్నదై ఉండాలి.

ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మనమంతాతో యేలేటి ఖాతాలో మరో హిట్ సినిమా పడ్డట్టే అన్నమాట.మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube