తన 'గాడ్'తో జక్కన్న ఫోటో మూమెంట్.. పిక్ వైరల్!

ఇప్పుడు ఎక్కడ చుసిన మన డైరెక్టర్ రాజమౌళి గురించే చర్చ జరుగుతుంది.ప్రపంచ వ్యాప్తంగా ఎస్ ఎస్ రాజమౌళి పేరు మారుమోగి పోతుంది.

 Ss Rajamouli Meets His 'god' Steven Spielberg, Rrr, Ram Charan, Rajamouli, Ntr,-TeluguStop.com

ఎందుకంటే ఈయన తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.అందుకే మన తెలుగు డైరెక్టర్ అయిన రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చించు కుంటున్నారు.

అఖిల భారతావళి మరోసారి గర్వించ దగ్గ మూమెంట్ జరిగింది.అగ్ర డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా ఇండియన్ వైడ్ గా రిలీజ్ అయ్యి గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్ లో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్ వేడుకల్లో అవార్డు గెలుచుకుని అందరి చేత రాజమౌళి అండ్ టీమ్ ప్రశంసలు అందుకుంటున్నారు.ఇక ఈ వేడుకల్లో భాగంగానే ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం హాలీవుడ్ లో సందడి చేస్తుంది.రాజమౌళి ఎప్పుడు చెబుతూ ఉంటాడు.

తనకు హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పెల్ బర్గ్ అంటే ఇష్టం అని.

మరి తాను ఎంతో అభిమానించే, స్ఫూర్తిని పొందిన డైరెక్టర్ ను రాజమౌళి మొదటిసారి కలవడంతో ఆ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.డైరెక్టర్ స్టీవెన్ స్పెల్ బర్గ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ గాడ్ అంటూ కామెంట్ చేసాడు.కీరవాణి కూడా ఈ డైరెక్టర్ తో కలిసి ఫోటో దిగారు.

ముగ్గురు కలిసి దిగిన ఈ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube