Oscar Awards : ఆస్కార్ అవార్డు వెనక అసలైన జీనియస్..ఇతను లేకుంటే వచ్చేది కాదు

కీరవాణి (Keeravani)చాల సంస్కారవంతుడు అని చెప్పడానికి ఈ రోజు జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు.తాను ఆస్కార్ ని ఒడిసి పట్టుకోగానే తనకు ఇంతటి అవకావం ఇచ్చిన రాజమౌళి ని లేదా ఇంకా టీమ్ లో ఎవరిని గుర్తు చేసుకోకుండా కేవలం ఒక పేరు మాత్రమే చెప్పాడు.

 Ss Karthikeya Real Person Behind Oscar For Rrr Movie-TeluguStop.com

ఆ పేరు మరేదో కాదు కార్తికేయ .ఈ రోజు నేను ఇక్కడ ఉండటానికి కారణం కార్తికేయ అంటూ ఎలాంటి మొహమాటం లేకుండా చేప్పేసాడు.మరి ఆలా చెప్పడం అందరికి సాధ్యం కాదు.ఇప్పుడు అయితే కీరవాణి చెప్పాడు కానీ ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ అన్ని ప్రమోషన్ ఇంటర్వూస్ లో కార్తికేయ(Karthikeya) పేరు చెప్తూ వచ్చాడు.

Telugu Ntr, Karthikeya, Keeravani, Naatu Naatu, Rajamouli, Rajamouli Son, Ram Ch

అతడు నిజమైన కార్యదీశాడు అంటూ పొగిడేవాడు.రమ కి సొంత పుత్రుడు అయినా కూడా రాజమౌళి కి (Rajamouli) ఇతగాడు దత్త పుత్రుడు మాత్రమే.జగపతి బాబు ఇంటి అమ్మాయి అయినా పూజ ను ఆ మధ్య కార్తికేయ వివాహం చేసుకున్నాడు.ఇది కార్తికేయ కుటుంబ నేపథ్యం.ఇక ఆర్ ఆర్ ఆర్ (RRR) విషయానికి వస్తే ఈ చిత్రం కథ నుంచి ఆస్కార్ వరకు అన్ని కార్తికేయ వల్లనే సాధ్యం అయ్యాయి.కార్తికేయ ఒక జీనియస్.

సినిమా ప్రొడక్షన్ నుంచి విదేశాల్లో, స్వదేశం లో ప్రమోషన్స్.మార్కెటింగ్ వ్యవహారాలు.

డబ్బు లెక్కలు అన్ని కార్తికేయ దగ్గరుండి చూసుకున్నాడు.రాజమౌళి కి మరియు ట్రిపుల్ ఆర్ సినిమాకు కార్తికేయ ఒక వెన్నెముక లాంటి వ్యక్తి.

అందరి లాగ చిన్న చితక అల్లరి వేషాలు ఉండవు.అతడి పని అతడు చాల నిశ్శబ్దం గా చేసుకుంటూ పోతాడు.

Telugu Ntr, Karthikeya, Keeravani, Naatu Naatu, Rajamouli, Rajamouli Son, Ram Ch

అన్ని విషయాల్లో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడు.తెరవెనక మాత్రమే ఉండే కార్తికేయ ఈ రోజు ఆస్కార్ వేదిక పైన కీరవాణి వల్ల అందరికి చేరువ అయ్యాడు.సినిమాలో పని చేసిన స్టార్ హీరోలు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, డ్యాన్స్ మాస్టర్స్, సింగర్స్ ఇంత మంది ఉన్న కీరవాణి నిజాన్ని నిర్భయం గా తమ్ముడు దత్తత కొడుకు అనే బేషజానికి పోకుండా చెప్పేసాడు.అది కీరవాణి మరియు రాజమౌళి కుటుంబం గప్పతనం.

అందుకే ఆస్కార్ ని మన తెలుగు వాకిట్లో నిల్చోబెట్టిన జీనియస్ గా కార్తికేయ ను నిలబెట్టింది.కార్తికేయ కు ప్రపంచ సినిమా మార్కెట్ గురించి ఒక మంచి విజన్ ఉంది.

రమ తన కొడుకును చూసి ఖచ్చితంగా గర్వపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube