బాయ్ ఫ్రెండ్ తో విడిపోవడానికి కారణం చెప్పిన శృతి హాసన్  

బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ గురించి ఓపెన్ అయిన శృతి హాసన్. .

Sruthi Hassan Told About Breakup Love Story-

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ శృతిహాసన్.హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ బాలీవుడ్ లో కంటే సౌత్ లోనే స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Sruthi Hassan Told About Breakup Love Story--Sruthi Hassan Told About Breakup Love Story-

శృతిహాసన్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న సమయంలోనే ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడి కొంతకాలం లండన్ లో తన ప్రేమికుడుతో తిరిగి మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటున్న తరుణంలో సడెన్ గా బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మరల ఇండియా వచ్చిన శృతి హాసన్ సినిమాలపై దృష్టి పెట్టి తెలుగులో రెండు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పుకోవడానికి కారణాలు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దామని అనుకున్న అనుకోకుండా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి తమ రిలేషన్ షిప్ వర్కౌట్ అవదు అని భావించి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని తర్వాత విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని శృతిహాసన్ తెలియజేసింది.

తను సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమని ప్రస్తుతం సింగిల్ గా హ్యాపీ గా ఉన్నానని స్పష్టం చేసింది.తన బ్రేకప్ గురించి తెలిసిన తన ఫ్రెండ్స్ మొదట్లో స్టార్ట్ అయిన తర్వాత ఫీలింగ్స్ అర్థం చేసుకున్నారని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.

బ్రేకప్ తర్వాత తన మనసు కలిగిన బాధ గురించి ఒక పాట కూడా రాసినట్లు చెప్పింది.ప్రస్తుతం తను యాక్టింగ్ మీద ఫుల్ గా ఫోకస్ పెట్టినట్లు కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.