సినిమా స్క్రిప్ట్ రాస్తున్న శృతి హసన్... నెక్స్ట్ డైరెక్షనేనా?

సౌత్ లో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న భామలలో ముందుగా గుర్తుకొచ్చేది శృతి హసన్.కమల్ హాసన్ కూతురు అనే బ్రాండ్ తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ కేవలం తన అందంతోనే కాకుండా తన టాలెంట్ తో కూడా అందరిని ఆకట్టుకుంది.

 Sruthi Hassan Script Work For Her Stories, Tollywood, Salaar Movie, Kamal Hassan-TeluguStop.com

ఈమెలో ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉంది, అలాగే మంచి పాప్ గాయని, మంచి డాన్సర్, అలాగే లెరిక్ రైటర్ కూడా.వీటితో పాటు హీరోయిన్ గా, డాన్సర్ గా కూడా తనలోనే డిఫరెంట్ షేడ్స్ ని శృతి హసన్ ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఉంటుంది.ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కూడా మ్యూజిక్ డైరెక్టర్ గానే.తరువాత హిందీ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది.అక్కడ సక్సెస్ కాకపోయినా తెలుగులో గబ్బర్ సింగ్ తో హిట్ కొట్టి సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిపొయింది.అయితే లాక్ డౌన్ కాలంలో ఈ భామ తనలోని మరో కళని బయటకి తీసింది.

లాక్ డౌన్ కాలంలో ఇంటికే పరిమితం కావడంతో ఈ భామ స్టొరీ రైటర్ గా మారిపోయింది.మంచి మంచి కథలని సిద్ధం చేసుకుందని తెలుస్తుంది.అయితే ఇప్పుడు ఓ వైపు సినిమాలు చేస్తూనే ఖాళీ దొరికినప్పుడు అందులో తనకి భాగా నచ్చిన కథకి స్క్రిప్ట్ వర్క్ చేస్తూ స్క్రీన్ ప్లే కూడా రాస్తుందని తాజాగా శృతి హసన్ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం శృతి ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ సలార్ సినిమాలో నటిస్తుంది.

అయితే ఇప్పుడు రాసుకుంటున్న స్క్రిప్ట్ తో భవిష్యత్తులో తండ్రిలా దర్శకురాలిగా కూడా మారిపోతుందేమో అనేది చూడాలి.ఎంతైనా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న ఈ అమ్మడు తనలోని దర్శకురాలిని కూడా బయటకి తీసుకొచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందేమో అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube