బాలయ్య కోసం శృతి హాసన్ షాకింగ్ నిర్ణయం.. కెరీర్ నాశనానికి అంత సిద్ధం?

వెండితెరపై కమల్ హాసన్ వారసురాలిగా అడుగుపెట్టిన శృతిహాసన్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అనగనగా ఒక ధీరుడు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి మొదటి సినిమానే ఫ్లాప్ గా నిలబడింది.

 Shruthi Haasan Gaining Weight For Balakrishna Movie,  Shruthi Hassan, Balakrishn-TeluguStop.com

అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ తరువాత పలు సినిమాలలో నటించిన అనుకున్నంత గుర్తింపు రాలేదు.ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శృతి హాసన్ ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

ఇలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో తిరిగి ఇండస్ట్రీలో బిజీ అయ్యారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి సలార్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు.ఇందులో శృతి హాసన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉండగా శ్రుతిహాసన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు సరసన నటిస్తోందని తెలుస్తోంది.

Telugu Balakrishna, Carrier, Shruthi Haasan, Shruthi Hassan, Shrutihaasan, Tolly

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నారు.దాదాపు చివరి దశకు షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం తర్వాత బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా వెల్లడించారు.ప్రస్తుతం ఈ సినిమా NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉంది.ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించడం కోసం ఎంతో మంది హీరోయిన్లను వెతికినప్పటికీ ఫైనల్ గా దర్శకుడు శృతి హాసన్ ని సంప్రదించి ఈ సినిమాలో నటించాలని కోరారు.

అయితే గోపీచంద్ తో ఉన్న అనుబంధంతో శృతిహాసన్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోక తప్పలేదు.

Telugu Balakrishna, Carrier, Shruthi Haasan, Shruthi Hassan, Shrutihaasan, Tolly

ఇందులో బాలకృష్ణ భార్యగా ఓ గృహిణి పాత్రలో శృతి హాసన్ కనిపించనుందని సమాచారం.అయితే ప్రస్తుతం ఎంతో స్లిమ్ గా ఉన్నటువంటి శృతిహాసన్ బాలయ్య సినిమాలో నటించడం కోసం శరీర బరువు పెరగారని సూచించారట.ఈ విషయం తెలిసిన శృతి అభిమానులు బాలకృష్ణ సినిమాలో నటించడం కోసం తన కెరీర్ ను నాశనం చేసుకోబోతోందా అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమాలో వీరిద్దరి జోడి ఏవిధంగా ఉండబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube