మెగాస్టార్ చిరంజీవి జోడీగా శృతి హాసన్.. అది సాధ్యమేనా?

కోలీవుడ్ స్టార్ డాటర్ గా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శృతి హసన్ కొన్ని సంవత్సరాలపాటు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సరసన నటించిన క్రాక్  సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేశారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో మరోసారి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు.

 Shruthi Hasan To Be Paired With Chiranjeevi Details,  Chiranjeevi, Sruthi Hasan,-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సలార్  సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా తిరిగి ఈ ఏడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా శృతిహాసన్ సందడి చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శృతిహాసన్ మరొక స్టార్ సీనియర్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇంతకీ ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే…

మెగాస్టార్ చిరంజీవి తన 154 చిత్రాన్ని బాబి దర్శకత్వంలో యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ మధ్య కాలంలోనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని వరుస సినిమా షూటింగ్ ను ప్రారంభించిన చిత్ర బృందం ఇందులో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటించడం కోసం శృతి హాసన్ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించినట్లు సమాచారం.కథ విన్న ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube