వింత ఆచారం : ఆ కొండ మీద తెలియనివారితో శృంగారం చేస్తే ... అదృష్టం కలిసి వస్తుందట.. ఇంతకీ అది ఎక్కడో తెలుసా...  

Srungaram Mountain Mount Kemukus-

మనకి తెలుయని వ్యక్తులను పలకరించాలంటేనే మొహమాట పడుతాం.పరిచయం లేని వ్యక్తులతో కాస్త కలిసిపోవాలంటే కొంత సమయం పడుతుంది.అలాంటిది ఆ ప్రాంతం లో ఏకంగా గుర్తు తెలియని వ్యక్తులతో శృంగారం చేస్తారట...

Srungaram Mountain Mount Kemukus--Srungaram Mountain Mount Kemukus-

అలా చేయడం వల్ల వారికి అదృష్టం వరిస్తుందట.ఏంటి నమ్మశక్యంగా లేదా ? ఇది నిజం .

ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ .ఆ ఆచారాలు ఎవరు పాటిస్తారో తెలుసుకుందాం.

Srungaram Mountain Mount Kemukus--Srungaram Mountain Mount Kemukus-

ప్రపంచం లో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా దేశం లోని జావా ద్వీపంలో కెముకస్ అనే పర్వతంపై ప్రతి యేటా పోన్ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఆ కొండ పైన పెళ్ళైన మగవారు వారికి పరిచయం లేని వారితో శృంగారం లో పాల్గొనాలి , అలా చేస్తే వారికి అదృష్టం కలిసి వస్తుందట.ఈ ఆచారాన్ని ఇండోనేషియా లో గునుంగ్ కెముకస్ ప్రాంతం లో కొన్ని వందల సంవత్సరాల నుండి పాటిస్తున్నారు.ఈ ప్రాంతం కి వచ్చిన జనం అక్కడ వారికి నచ్చిన వారిని ఎంచుకొని ఇరువురి ఇష్టప్రకారంగా శృంగారం చేస్తారు.

ఈ వింత ఆచారం వెనుక ఉన్న కథ ఇదే.

16వ శతాబ్దంలో జావా ప్రాంతాన్ని ఓ రాజు పాలించేవాడు.ఆయనకు పంగేరన్ సముద్రో అనే కుమారుడు ఉండేవాడు.ఆ రాజకుమారుడికి సవతి తల్లి అయిన న్యాయి ఓంట్రోవులాన్‌తో శారీరక సంబంధం ఉంది...

వారి మధ్య ఉన్న సంబంధం గురించి రాజు కి తెలియడం తో వారిద్దరూ సోలో అనే ప్రాంతానికి పారిపోయారు.అదే ప్రాంతం లో నివసిస్తున్న వారు ఒక రోజు శృంగారం లో పాల్గొటున్న సమయంలో స్థానికులు వారి పైన దాడి చేసి చంపేశారు.తమ సమాధి దగ్గర ఎవరైతే సంభోగిస్తారో.

వారికి మంచి జరుగుతుందని, అదృష్టం కలిసొస్తుందని చెప్పి సముద్రో చనిపోయాడట.దానితో అప్పటి నుండి ఈ ఆచారం మొదలైంది.

పోన్ ఫెస్టివల్ ని ఎలా జరుపుకుంటారు

అక్కడి కి వచ్చిన ప్రజలు ఉదయాన్నే ప్రార్థనలతో ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు తర్వాత రాకుమారుడు, అతడి సవతి తల్లి సమాధి దగ్గర పూలు ఉంచి మళ్లీ ప్రార్థనలు చేస్తారు.తర్వాత పవిత్ర స్నానం ఆచరించి తమ భాగస్వామి కోసం వెతుకుతారు .నచ్చిన భాగస్వామి దొరికిన తర్వాత అదే రోజు రాత్రి శృంగారం లో పాల్గొంటారు.

ఈ ఆచారం ప్రకారం ప్రతి 35వ రోజున తప్పకుండా కలయికలో పాల్గొనాలి.ఇలా ఏడుసార్లు సంభోగించాలి.ఇందుకోసం ఆ జంటలు తమ ఫోన్ నెంబర్ లు మార్చుకొని ప్రతి 35 వ రోజున కలుసుకుంటారు.

ఈ ఫెస్టివల్ గురించి తెలిసిన కొంత మంది ఇండోనేషియా మగవారు గునుగ్ కెముకస్ కొండలు వెళ్తున్నామని భార్యల దగ్గర పెర్మిషన్ తీసుకుంటే మరికొందరు మాత్రం వారికి చెప్పకుండా వస్తారు.ఇక్కడికొచ్చే మగాళ్ల సంఖ్య ఎక్కువ కావడంతో అక్కడ వేశ్యాలకు డిమాండ్ ఏర్పడింది.