ప్రాణాలు తీస్తున్న కెనాల్స్.. మరో ముగ్గురు మృతి.. !

రోడ్డు ప్రయాణాలు రోజు రోజుకు ప్రమాదంగా మారుతున్నాయి.మూడు రోజుల క్రితం వరంగల్ జిల్లాలో కెనాల్‌ కారు ప్రమాదం ఘటన మరువక ముందే మరో కారు కెనాల్‌లో దూసుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.

 Another Car Accident By Srsp Canal At Katlakunta, Jagityal, Srsp Canal, Killing,-TeluguStop.com

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట వద్ద కారు ఎస్సారెస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు గల్లంతయ్యారు.

ఒకరు సురక్షితంగా బయటపడ్డారు.ఇక గల్లంతైన వారు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

ఇకపోతే ఈ ప్రమాద ఘటనలో మరణించిన వారిలో కోరుట్ల మండలం జొగినిపల్లికి చెందిన న్యాయవాది అమరేందర్ రావు, అమరేందర్ రావు భార్య శిరీషా, కూతురు శ్రేయా, కాగా అమరేందర్ రావు కుమారుడు జయంత్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

Telugu Car, Jagityal, Jayanth, Katlakunta, Laweramarender, Medipalli, Srsp Canal

అయితే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ జయంత్ బయటికి వచ్చి చెప్పే వరకు కారు కెనాల్ లో పడ్డ విషయం ఎవరికీ తెలియదు.ఇకపోతే ఈ మధ్యకాలంలో కెనాల్‌లు కూదా చాలా ప్రమాదకరంగా మారి ప్రాణాలను హరిస్తున్నాయి.ఈ విషయంలో అధికారులు ఏదో ఒకటి చేయకుంటే మాత్రం మరెన్ని ప్రాణాలు గాల్లో కలవవలసి వస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube