బాబా అవతారం.. గుట్టుచప్పుడు కాకుండా రాసలీలలు  

Baba, srikalahasti , Srikalahasti Baba Arrested, police - Telugu Ap, Baba, Police, Rasalila, Srikalahasti, Srikalahasti Baba Arrested

బాబాగా అవతారమెత్తి మహిళలను, యువతులను లోబర్చుకుని వారితో ఓ వ్యక్తి తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు.కోరిక తీర్చుకున్న తర్వాత చేతబడి చేసి మీ కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడే వాడు.

 Srkalahasti Baba Arrested

దీంతో ఆ యువతులు భయభ్రాంతులకు గురై పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.

శ్రీకాళహస్తి పట్టణంలో బాబా ముసుగులో ఓ వ్యక్తి చేస్తున్న రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాబా అవతారం.. గుట్టుచప్పుడు కాకుండా రాసలీలలు-General-Telugu-Telugu Tollywood Photo Image

పూసల వీధికి చెందిన ఓ వ్యక్తి పొట్టకూటి కోసం బాబా అవతారమెత్తాడు.స్థానికులు తనకు మంత్రశక్తులు ఉన్నాయని, చేతబడులు చేస్తానని నమ్మించాడు.ఈ క్రమంలో మహిళలను, యువతులను లోబర్చుకుని వారితో తన కామవాంఛను తీర్చుకున్నాడు.ఈ విషయం బయటపడకుండా వారిపై బెదిరింపులకు పాల్పడే వాడు.

దీంతో భయాందోళనకు గురైన యువతుల కుటుంబసభ్యులు గురువారం పోలీసులను ఆశ్రయించి అసలు విషయం చెప్పారు.

పోలీసులు బాబాను స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ చేపట్టగా ఓ అధికార పార్టీ నేత అందులో ఇన్వాల్వ్ అయి రాజీకి కుదర్చాడు.

ఆడబిడ్డల పరువు విషయంతో ఆ కుటుంబం కూడా రాజీకి అంగీకరించినట్లు తెలిసింది.దీంతో రాసలీలలు పాల్పడుతున్న ఓ బాబాకు అధికార పార్టీ అండ ఇవ్వడం ఏంటనీ అందరూ చర్చించుకుంటున్నారు.

న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే అండగా నిలబడుతోందని ఆరోపిస్తున్నారు. ఆడపిల్లలు జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

#Srikalahasti #AP #Baba #Rasalila #Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Srkalahasti Baba Arrested Related Telugu News,Photos/Pics,Images..