శ్రీవిష్ణు 'సామజవరగమన' అయినా గట్టెక్కిస్తుందా..?

యువ హీరోల్లో కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరించాలని చూస్తున్న శ్రీవిష్ణు మొదట్లో సక్సెస్ అందుకున్నా ఈమధ్య అతని సినిమాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర సందడి చేయట్లేదు.ఈ క్రమంలో కొద్దిపాటి గ్యాప్ తర్వాత మరో కొత్త సినిమాతో వస్తున్నాడు శ్రీవిష్ణు.

 Srivishnu Samajavaragamana Movie News,sree Vishnu , Sree Vishnu  , Anil Sunkara-TeluguStop.com

ఈసారి క్రేజీ టైటిల్ తో వస్తున్నాడు శ్రీవిష్ణు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపుమ్రములో సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ సామజవరగమన సాంగ్ నే టైటిల్ గా శ్రీవిష్ణు సినిమా వస్తుంది.

ఈ సినిమాను రాం అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నారు.

అనీల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ లో రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాలో వెన్నెల కిశోర్, వికే నరేష్ లాంటి వారు కూడా నటిస్తున్నారు.

మరి సామజవరగమన సినిమా అయినా శ్రీవిష్ణు కోరుకున్న హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సామజవరగమన సినిమా శ్రీవిష్ణుని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube