శ్రీ విష్ణు, చైతన్య దంతులూరి, వారాహి చలన చిత్రం ‘భళా తందనాన’లో హీరోయిన్ కేథరిన్ థ్రెసా ఫస్ట్ లుక్ విడుద‌ల‌

శ్రీ విష్ణు, కేథ‌రిన్ థ్రెసా కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న చిత్రం `భళా తందనాన` .ఈ సినిమాకు బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.

 Srivishnu Movie Bhala Tandanana Heroine Catherine Theresa First Look Released, S-TeluguStop.com

కేథ‌రిన్ థ్రెసా పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు.

చీరకట్టులో కేథ‌రిన్ థ్రెసా అద్భుతంగా కనిపించారు.

శశి రేఖ అనే పాత్రలో కేథ‌రిన్ థ్రెసా కనిపించబోతోన్నారు.ఎంతో ధైర్యం కలిగిన అమ్మాయి పాత్రలో కేథ‌రిన్ థ్రెసా అదరగొట్టనున్నారు.

ఇక హీరో శ్రీ విష్ణును ఇది వరకెన్నడూ చూపించినటువంటి పాత్రలో ప్రజెంట్ చేయబోతోన్నారు ద‌ర్శ‌కుడు చైత‌న్య‌.కేథ‌రిన్ థ్రెసా అయితే ఎంతో సెలెక్టివ్‌గా సినిమాల్లో నటిస్తున్నారు.

అలాంటి హీరోయిన్‌కు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది.కేజీయఫ్ ఫేమ్ రామచంద్రరాజు ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.

వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.శ్రీకాంత్ విస్సా రచయిత.

మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, గంధి నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

Telugu Bhala Tandanan, Bhala Tandanana, Srivishnu, Tollywood, Varahi-Movie

భళా తందనాన శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

నటీనటులు: శ్రీ విష్ణు, కేథరిన్ థ్రెసా, రామచంద్ర రాజు

సాంకేతిక బృందం

దర్శకుడు: చైతన్య దంతులూరి నిర్మాత: రజనీ కొర్రపాటి సమర్పణ: సాయి కొర్రపాటి బ్యానర్: వారాహి చలన చిత్రం సంగీతం: మణిశర్మ ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్ సినిమాటోగ్రఫర్: సురేష్ రగుతు యాక్షన్ కొరియోగ్రఫర్: పీటర్ హెయిన్ ఆర్ట్ డైరెక్టర్: గంధి నడికుడికర్ రచయిత: శ్రీకాంత్ విస్సా పీఆర్ఓ: వంశీ-శేఖర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube