పుష్ప అప్డేట్.. 'శ్రీవల్లి' లిరికల్ సాంగ్..వావ్ అనిపిస్తుందిగా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

 Srivalli Lyrical Song Released From Pushpa Movie-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్, పోస్టర్స్ అన్ని కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.

ఇక ఈ మధ్యనే రష్మిక లుక్ కూడా రివీల్ చేసారు.

 Srivalli Lyrical Song Released From Pushpa Movie-పుష్ప అప్డేట్.. శ్రీవల్లి’ లిరికల్ సాంగ్..వావ్ అనిపిస్తుందిగా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో రష్మిక పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది.అల్లు అర్జున్ కు సరిగ్గా సరిపోయే మాస్ లుక్ లో రష్మిక లుక్ ప్రేక్షకులను అలరించింది.

ఇక తాజాగా ఈ రోజు పుష్ప నుండి మరొక సాంగ్ విడుదల అయ్యింది.శ్రీవల్లి అనే సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

పాటను సిద్ శ్రీరామ్ ఆలపించడంతో ఈ పాట రేంజ్ పీక్స్ కు వెళ్ళింది.

సాంగ్ మొత్తం ఆద్యంతం అలరిస్తుంది.ఈ పాటలో అల్లు అర్జున్ ఎక్సప్రెషన్స్ గురించి మరొకసారి చెప్పుకోవాలి.అతడి ఆటిట్యూడ్ మొత్తం ఈ పాటలో చాలా డిఫెరెంట్ గా ఉంది.

చూపే బంగారామాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే” అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది.దేవి శ్రీ తన మ్యూజిక్ తో మరొకసారి మ్యాజిక్ చేసాడు.

చాలా రోజుల తర్వాత దేవి శ్రీ నుండి తన మార్క్ సాంగ్ వింటున్నట్టు ప్రేక్షకులు భావిస్తున్నారు.ఈ పాటను మేకర్స్ సరికొత్తగా మన ముందుకు తెచ్చారు.ఈ పాట చూసినంతసేపు లిరికల్ సాంగ్ అయినా కూడా వేరే లోకంలోకి వెళ్లి పోయినట్టు అనిపిస్తుంది.మొత్తానికి సుకుమార్ ఈ సినిమాను ఎంత కొత్తగా ప్రెసెంట్ చేయబోతున్నాడో ఇలాంటి అప్డేట్ లు చూస్తేనే అర్ధం అవుతుంది.

ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న మన ముందుకు రాబోతుంది.

https://youtu.be/i5Mb3yw8O3A
#Devi Sri Prasad #Srivalli #Sriram #Pushpa #Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు