శ్రీవల్లి క్రేజ్ మామూలుగా.. ఛాతీ పైనే ఆటోగ్రాఫ్ అడిగిన యువకుడు?

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈమె భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ హిందీ భాషలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

 Srivalli Craze As Usual The Young Man Who Asked For An Autograph On His Chest ,-TeluguStop.com

ఇకపోతే ఈమె హిందీలో నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శ్రీవల్లి పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ అయ్యారు.

 Srivalli Craze As Usual The Young Man Who Asked For An Autograph On His Chest ,-TeluguStop.com

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఓ అభిమాని రష్మిక దగ్గరకు వెళ్లి తనకు ఆటోగ్రాఫ్ కావాలని అడిగారు.

దీంతో రష్మిక ఎక్కడ ఇవ్వాలి అని ప్రశ్నించడంతో ఏకంగా ఆ యువకుడు తన ఛాతీ పై ఆటోగ్రాఫ్ ఇవ్వమంటూ ముందుకు రావడంతో రష్మిక ఒక్కసారిగా షాక్ అయింది.ఈ క్రమంలోనే ఈమె అభిమాని టీషర్టుపై తన ఆటోగ్రాఫ్ ఇచ్చారు.

దీంతో ఆ అభిమాని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్లు చేయగా.మరికొందరు రష్మిక క్రేజ్ మామూలుగా లేదు మరి ఈ రేంజ్ లో నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈమె నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7 వ తేదీ విడుదల కానుంది ఇందులో అమితాబచ్చన్ కూడా కీలక పాత్రలో నటించారు.ఇక ఈ సినిమాతో పాటు ఈమె హీరో విజయ్ సరసన వారసుడు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube