శ్రీశైలం ఆలయం మూసివేత స్వామిఅమ్మవార్ల దర్శనలు రద్దు

శ్రీశైలం ఆలయంలో శాస్త్రోక్తంగా వేకువజామున నుంచి పూజలు నిర్వహించి ఉదయం 6 గంటలకు ఆలయం ప్రధాన ద్వారాలు మూసివేశారు నేడు సూర్యగ్రహణం కారణంగా ఉదయం 6 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేశామని ఈఓ లవన్న తెలిపారు స్వామిఅమ్మవార్ల దర్శనాలు కూడ తాత్కాలికంగా రద్దు చేశారు దర్శనాలతోపాటు ఆర్జిత సేవలు స్వామిఅమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6.30 వరకు ఆలయద్వారాలు మూసి ఉంచుతామని ఈఓ తెలిపారు అయితే ఇవాళ వేకువజామున 3 గంటలకు ఆలయద్వారాలు తెరచి మంగళ వాయిద్యాలు,3.

30కు సుప్రభాతసేవ,4.30 శ్రీస్వామి అమ్మవార్ల మహామంగళ హారతులు పూజలు ఆలయంలో శాస్త్రోక్తంగా జరిపించి అనంతరం ఉదయం 6 గంటలకు ఆలయద్వారాలు మూసివేశామన్నారు.సాయంత్రం 6.30కు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి అనంతరం సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు నిర్వహించి రాత్రి 8 గంటల నుంచి భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని దేవస్థానం అధికారులు వెల్లడించారు గ్రహణం రోజు కావడంతో పరివార ఆలయాలు ఉపాలయాలను కూడా మూసివేశామన్నారు సాయంకాలం 6.30 కి తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ పూజాదికాలు నిర్వహిస్తామన్నారు గ్రహణం కారణంగా అన్ని ఆర్జితసేవలు, శాశ్వతసేవలు, పరోక్షసేవలు నిలుపుదల చేసినట్లు ఈఓ వెల్లడించారు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడ నిలుపుదల చేశారు రాత్రి 8గంటల నుంచి అల్పాహారం అందజేస్తామని దేవస్థానం ఈఓ లవన్న చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు.

" autoplay>

తాజా వార్తలు