దేవుళ్ల కు కూడా కరోనా దెబ్బ, ఆలయాలకు కూడా లాక్ డౌన్!

గుడి,బడి అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా,మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది.

 Srisailam Temple Close For One Week Because Of Covid-19 Pandemic , Coronavirus,-TeluguStop.com

మరోపక్క ఆలయాల్లో కూడా ఈ కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుంది.శ్రీశైలం ఆలయంలో ఇద్దరు పరిచారికలు అలానే ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ రావడం కలకలం రేగింది.

దీనితో వారం రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.అయితే స్వామి వారికి నిర్వహించే పూజలు,కైంకర్యాలు మాత్రం యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.

ఇటీవల తిరుమలకు కూడా భక్తుల రద్దీ తగ్గినట్లు తెలుస్తుంది.లాక్ డౌన్ కారణంగా 45 రోజుల పాటు మూసి వేసిన తిరుమల దేవస్థానం ఇటీవల తెరుచుకోవడం తో భక్తులు అందరూ కూడా స్వామి వారిని దర్శించుకోవడానికి ఉవ్విల్లూరారు.

అయితే రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం టీటీడీ లోనే దాదాపు 90 మందికి కరోనా సోకడం తో జనాలు కూడా కొంచం వెనక్కి తగ్గినట్లు అనిపిస్తుంది.

ముఖ్యంగా చిత్తూరు,తిరుపతి లలో ఎక్కువగా కేసులు నమోదవుతుండటం కూడా భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమవుతుంది.

మరోపక్క తెలంగాణా ఆలయాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.దీనితో శ్రీశైలం బాటలోనే మిగతా దేవాలయాలు కొనసాగాలా అన్న సందిగ్ధం లో పడ్డారు.మరి లాక్ డౌన్ ఆలయాలకు కూడా విధిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube