మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం, సాగర్‌ గేట్లు

కృష్ణ నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో గత నెలలో సదరు నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారిపోయాయి.ఎక్కువగా వచ్చిన నీటిని కిందకు వదిలేందుకు అన్ని ప్రాజెక్ట్‌ల గేట్లను తెరిచారు.

 Srisailam And Sagargates Onemore Timeopen Water-TeluguStop.com

గత నెలలో శ్రీశైలం మరియు నాగార్జున సాగర్‌ల గేట్లను దాదాపు రెండు వారాలు పూర్తిగా ఓపెన్‌ చేసి నీటిని దిగువకు వదలడం జరిగింది.వీటి ద్వారా వచ్చిన నీటితో ప్రకాశం బ్యారేజ్‌ కూడా ఫుల్‌ అవ్వడంతో నీటిని సమద్రంలో వదిలారు.

పై నుండి వరద తగ్గడంతో గేట్లు క్లోజ్‌ చేశారు.మళ్లీ ఇప్పుడు కృష్ణనది ఎగువ ప్రాంతంలో వర్షాలు భారీగా వస్తున్న కారణంగా శ్రీశైలం మరియు సాగర్‌లకు భారీగా వరద వస్తోంది.

 Srisailam And Sagargates Onemore Timeopen Water-మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం, సాగర్‌ గేట్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతకు ముందే నిండు కుండలా ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్‌లు కాస్త వరదకే మళ్లీ గేట్లు తెరుచుకున్నాయి.శ్రీశైలం నుండి 10 గేట్లు ఎత్తి 3.7 లక్షల క్యూసెక్‌ల నీటిని కిందికి వదులుతున్నారు.ఇక ప్రస్తుతం సాగర్‌ గేట్లను కూడా ఎత్తేయడం జరిగింది.

ప్రస్తుతానికి సాగర్‌ రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.శ్రీశైలం నుండి వరద పెరిగిన నేపథ్యంలో మరో నాలుగు లేదా అయిదు గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

మొత్తానికి కృష్ణమ్మ ఈసారి రైతుల కళ్లలో ఆనందాన్ని నింపుతోంది.

#Srisailam Gate #SrisailamGates #Krishna River #Andhrapradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు