డబ్బు కోసం ఆ పని చేస్తున్నా.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్..?

వివాదాల ద్వారా నిత్యం వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి అనుకూలంగా కామెంట్లు చేసి శ్రీరెడ్డి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

 Srireddy Workout Videos Goes Viral In Social Media-TeluguStop.com

వైసీపీలో చేరాలని శ్రీరెడ్డి భావిస్తున్నా ఆ పార్టీ నుంచి శ్రీరెడ్డికి పిలుపు వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది.రఘురామ కృష్ణంరాజు వివాదం చెలరేగిన సమయంలో శ్రీరెడ్డి తీవ్రస్థాయిలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

జగన్ పై ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే వాళ్లకు షాక్ ఇచ్చే విధంగా శ్రీరెడ్డి కామెంట్లు చేస్తున్నారు.తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తన వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

 Srireddy Workout Videos Goes Viral In Social Media-డబ్బు కోసం ఆ పని చేస్తున్నా.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వర్కౌట్ వీడియో పోస్ట్ చేయడం గురించి శ్రీరెడ్డి చెబుతూ రాజకీయాల్లోకి రావాలని ఉన్నా ఈలోగా మా బ్రతుకు మేము బ్రతకాలి కదా అని పేర్కొన్నారు.రాజకీయాల్లో అవకాశం ఇస్తారో ఇవ్వరో అని చెప్పుకొచ్చారు.

Telugu Ap Cm Jagan, Earning Money, Goes Viral, Social Media, Sri Reddy In Politics, Sri Reddy Into Ycp, Sri Reddy Viral Video, Srireddy, Workout Videos, Ycp-Movie

ఇలా చేస్తే సోషల్ మీడియాలో మాకు పైసలు ఇస్తారని శ్రీరెడ్డి తెలిపారు.ఇష్టం లేకపోయినా చేయక తప్పలేదని శ్రీరెడ్డి అన్నారు.ఈ విధంగా చేస్తున్నందుకు వైసీపీ తమ్ముళ్లు తనను క్షమించాలని శ్రీరెడ్డి కోరారు.మరో పోస్ట్ లో సీఎం జగన్ తనను వైసీపీలోకి ఆహ్వానించాలని శ్రీరెడ్డి కోరారు.తనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలని విజ్ఞప్తి చేస్తున్నానని శ్రీరెడ్డి అన్నారు.

Telugu Ap Cm Jagan, Earning Money, Goes Viral, Social Media, Sri Reddy In Politics, Sri Reddy Into Ycp, Sri Reddy Viral Video, Srireddy, Workout Videos, Ycp-Movie

ముల్లును మల్లుతోనే తీయాలని శ్రీరెడ్డి సూచనలు చేశారు.సమయం చూసి తనకు జగన్ అవకాశం ఇస్తారని తాను భావిస్తున్నానని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.తాను ఏకే 47లా ఉంటానని జగన్ జోలికి వస్తే వాడి తల ఎగిరిపోవాలని శ్రీరెడ్డి అన్నారు.

ఫేస్ బుక్ వేదికగా శ్రీరెడ్డి చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

#Social Media #Goes Viral #Earning Money #AP CM Jagan #Srireddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు