ఆ పర్సన్‌తో క్లోజ్‌గా ఉన్నావ్‌.. తప్పు కాదా.. దీప్తి సునైనాపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!

వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి నిన్న చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండనంటూ చేసిన వ్యాఖ్యల గురించి స్పందించి షాకింగ్ కామెంట్లు చేశారు.తాజాగా శ్రీరెడ్డి దీప్తిసునైనా షణ్ముఖ్ బ్రేకప్ గురించి స్పందిస్తూ దీప్తి సునైనాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 Srireddy Shocking Reaction Deepti Sunaina Breakup Shanmukh, Srireddy, Shocking C-TeluguStop.com

షణ్ముఖ్ దీప్తి సునైనా జంట చక్కని జంట అని శ్రీరెడ్డి అన్నారు.దీప్తి సునైనా షణ్ముఖ్ బ్రేకప్ చెప్పుకోవడం తనను కూడా కలచివేసిందని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు.

ఏం చేసినా మనం భారతీయులమనే విషయాన్ని మరిచిపోకూడదని శ్రీరెడ్డి అన్నారు.టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ ను వేసుకున్నా సంస్కృతి సాంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోకూడదని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ కాలం పిల్లలు టెక్నాలజీపరంగా డెవలప్ అయినా కొన్ని చిన్నచిన్న విషయాలకు సెన్సిటివ్ అయిపోతున్నారని శ్రీరెడ్డి అన్నారు.మనుషులు తప్పులు చేయడం సహజమని ఆమె చెప్పుకొచ్చారు.

షణ్ముఖ్ తో ఐదు సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉన్న దీప్తి సునైనా ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు.బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఘటనల వల్లే దీప్తి షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పిందని అర్థమైందని శ్రీరెడ్డి పేర్కొన్నారు.దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ కు వెళ్లిన సమయంలో ఒక వ్యక్తితో ఎంత క్లోజ్ గా ఉందో అందరం చూశామని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.అది ప్రేమ అనిపించే విధంగా దీప్తి ప్రవర్తించిందని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు.

నీ వరకు వస్తే తప్పు అనిపించలేదా అని ఆమె ప్రశ్నించారు.షణ్ముఖ్ తో పెళ్లి కాలేదు కాబట్టి దీప్తి బ్రేకప్ చెప్పిందని పెళ్లి జరిగి ఉంటే షణ్ముఖ్ ను ఆమె వదిలేసేదా? అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.తప్పులు క్షమించుకొని ఓపికతో ఉంటే సమస్యలు సాల్వ్ అవుతాయని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోతే టాటూలు వేయించుకోవద్దని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube