ఎన్టీఆర్ పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. అలాంటి హీరో అంటూ..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.ఆ తరువాత శ్రీరెడ్డి ఎంపీ రఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేశారు.

 Actress Srireddy Shocking Comments About Young Tiger Ntr, Srireddy, Shocking Com-TeluguStop.com

సినిమాల కంటే సోషల్ మీడియా పోస్టుల ద్వారానే వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను మాత్రం ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారు.ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఎన్టీఆర్ హ్యాండ్ సమ్ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

టాలీవుడ్ బెస్ట్ హీరో అంటూ శ్రీరెడ్డి ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు.ఎన్టీఆర్ పై, ఎన్టీఆర్ కుటుంబంపై దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని శ్రీరెడ్డి అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పై తనకు ఉన్న ఇష్టాన్ని శ్రీరెడ్డి చెప్పకనే చెప్పేశారు.శ్రీరెడ్డి చేసిన పోస్ట్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి అనూహ్య స్పందన వ్యక్తమవుతోంది.

ఎక్కువ మంది హీరోలపై విమర్శలు చేసే శ్రీరెడ్డి కొంతమంది హీరోలపై మాత్రం అభిమానాన్ని చాటుకుంటున్నారు.

గతంలో కూడా పలు సందర్భాల్లో శ్రీరెడ్డి ఎన్టీఆర్ ను పొగుడుతూ పోస్టులు పెట్టారు.

Telugu Chamber, Ntr, Ntr Fans, Ntr Pack, Sri Reddy Ntr, Sri, Young Tiger Ntr-Mov

ఫేస్ బుక్ లో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న శ్రీరెడ్డి తన అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు.క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి గతంలో ఎంతోమంది ప్రముఖులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.కొంతమంది సెలబ్రిటీల సీక్రెట్లను సైతం శ్రీరెడ్డి లీక్ చేశారు.

ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో నిలిచారు.

ప్రస్తుతం చెన్నైలో ఉన్న శ్రీరెడ్డి కొన్ని సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.భవిష్యత్తులో హీరోయిన్ గా బిజీ కావాలని శ్రీరెడ్డి ప్రయత్నాలు చేస్తుండగా ఆమె ఎంతమేర సక్సెస్ సాధిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube