పెళ్లి గురించి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. నార్మల్ అబ్బాయిలు చేసుకోలేరంటూ?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.శ్రీరెడ్డి నటించిన సినిమాలు తక్కువే కాగా వివాదాలు, వివాదాస్పద అంశాల ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో నిలిచారు.

 Sri Reddy Shocking Comments About Marriage Goes Viral In Social Media ,sri Reddy-TeluguStop.com

తాజాగా పెళ్లి గురించి శ్రీరెడ్డి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తన మనస్సులో పెళ్లిపై నెలకొన్న అభిప్రాయాలను శ్రీరెడ్డి వెల్లడించారు.

ఇప్పటివరకు పెళ్లి విషయంలో ఒక్కరు కూడా సరైన వ్యక్తి అని నాకు అనిపించలేదని శ్రీరెడ్డి అన్నారు.చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేసి డేటింగ్ చేసి ఆ తర్వాత పక్కన పెట్టే విధంగా ఉన్నారని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

సంసారాన్ని నిలబెట్టుకుని పద్ధతిగా కాపురం చేసుకుందాం అనేవాళ్లు ఇప్పటివరకు కనిపించలేదని శ్రీరెడ్డి పేర్కొన్నారు.నేను రివర్స్ లో చెబుతున్నాను అనిపిస్తోందా అంటూ శ్రీరెడ్డి కామెంట్లు చేశారు.

నేను టిపికల్ క్యారెక్టర్ అని నన్ను మ్యారేజ్ చేసుకోవడం నార్మల్ అబ్బాయిల వల్ల కాదని ఆమె పేర్కొన్నారు.చాలా హై థింకింగ్, పెద్ద మనసు ఉన్నవాళ్లు మాత్రమే నన్ను పెళ్లి చేసుకోవడం సాధ్యం అవుతుందని శ్రీరెడ్డి కామెంట్లు చేయడం గమనార్హం.నాకు ఎవరూ నచ్చలేదా అంటే నాకు పట్టించుకునే సమయం లేదని ఆమె అన్నారు.పార్టీలకు వెళ్లిన సమయంలో కొంతమంది నచ్చుతారు కానీ వాళ్లకు అప్పటికే పెళ్లిళ్లు అయిపోయాయంటూ శ్రీరెడ్డి వెల్లడించారు.

ఒంటరిగా ఉండటం పెద్ద జబ్బు అని రతన్ టాటా గారు చెప్పారని అయితే ఒంటరిగా ఉంటే మనల్ని మనం మెరుగుపరచుకోవడం సాధ్యమవుతుందని శ్రీరెడ్డి పేర్కొన్నారు.ఒంటరిగా ఉంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చని ఒంటరితనం అనేది భోగం అని 90 శాతం ఒంటరిగా ఉండటం వల్ల చాలా హ్యాపీ అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

శ్రీరెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube