వెక్కివెక్కి ఏడ్చిన శ్రీరెడ్డి.. 20 సంవత్సరాలుగా ఎదురు చూశానంటూ..?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వివాదాల ద్వారా శ్రీరెడ్డి ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

 Srireddy Cried About Rajanikanth Political Party Back Step, Rajini Kanth, Sri Re-TeluguStop.com

ప్రముఖులపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి ఏడాది క్రితం వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి గత కొన్ని నెలల నుంచి హీరోయిన సమంత డ్రెస్సింగ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు.అయితే తాజాగా శ్రీరెడ్డి రజనీకాంత్ రాజకీయాల విషయంలో వెనక్కి తగ్గడంతో వెక్కివెక్కి ఏడ్చారు.

2021 సంవత్సరం మే నెలలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.గత కొన్నేళ్ల నుంచి రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటనలు చేస్తున్న రజనీకాంత్ 2020 డిసెంబర్ 31వ తేదీన పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు.

కానీ ఊహించని విధంగా రజనీకాంత్ అస్వస్థతకు గురి కావడం, ఏడు పదుల వయస్సులో రాజకీయాల్లో చేరడం సరైన నిర్ణయం కాదని పలువురు సూచించడంతో రజనీకాంత్ వెనక్కు తగ్గారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రజనీ రాజకీయాల్లోకి వెళితే కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని. 60 ఏళ్లు దాటిన వాళ్లకు కరోనా సోకితే ప్రమాదమని వైద్యులు చెబుతూ ఉండటం, సర్వేల ఫలితాలు కూడా అనుకూలంగా లేకపోవడంతో రజనీకాంత్ రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయం తీసుకున్నారు.అయితే శ్రీరెడ్డి తాను 20 సంవత్సరాలుగా రజనీకాంత్ పార్టీ పెడతారని ఎదురు చూస్తున్నానని వెల్లడించారు.

రజనీకాంత్ పార్టీ పెడితే ఆయన పార్టీలో తాను కూడా చేరాలని అనుకున్నానని కానీ ఊహించని విధంగా జరిగిందని శ్రీరెడ్డి బాధ పడ్డారు.రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం తనను అప్సెట్ చేసిందని.

రజనీకాంత్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల తాను హర్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు.అయితే శ్రీరెడ్డి త్వరలో ఏదో ఒక రాజకీయ పార్టీలో ఐతే చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

శ్రీరెడ్డి వెక్కివెక్కి ఏడ్చిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube