ఏమాత్రం తగ్గని శ్రీరెడ్డి, మరోసారి కాకరేపుతున్న ట్వీట్స్  

Srireddy Comments On Oh Baby Movie-daggupati Suresh Babu,rana Brother,srireddy

టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకోవాలి అనుకుంటే చాలా కష్టపడాల్సిందే. కానీ ఒక నటి విషయంలో మాత్రం ఎలాంటి కష్టం లేకుండా చాలా ఈజీ గా పెద్ద స్టార్ అయిపొయింది. ఇంతకీ ఆ నటి ఎవరు అని ఆలోచిస్తున్నారా..

ఏమాత్రం తగ్గని శ్రీరెడ్డి, మరోసారి కాకరేపుతున్న ట్వీట్స్ -Srireddy Comments On Oh Baby Movie

టాలీవుడ్ లో ఏ సినిమాలు చేసిందో కూడా సరిగ్గా చెప్పడానికి తెలీదు కానీ ఈ అమ్మడు సంచలన ట్వీట్స్ తో అందరికీ సుపరిచితురాలు. ఆమె శ్రీరెడ్డి, ఈ రోజుల్లో శ్రీ రెడ్డి గురించి తెలియని వారు ఎవరూ లేరు. చిన్న,పెద్ద నటులు అన్న తేడా లేకుండా తనకు నోటికి వచ్చిన రీతిలో ఇష్టం వచ్చినట్లు ట్వీట్స్ పెడుతూ పెను దుమారం సృష్టించింది.

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ పలువురు ప్రముఖుల పేర్లు బయటపెట్టి సోషల్ మీడియా వేదికగా తెగ క్రేజ్ సంపాదించుకుంది. అయితే తాజాగా సమంతను లాగుతూ శ్రీరెడ్డి ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఈ పోస్ట్ పైనే అంతా చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో సంచలనం గా మారింది.

అసలు విషయం ఏమిటంటే సమంత ప్రధాన పాత్రలో ఇటీవలే విడుదలైన ఓ బేబీ సినిమా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. అయితే ఈ వేడుకలో దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హాజరై సందడి చేయడమే కాకుండా సమంతతో కలిసి కేక్ కట్ చేసి ఓ బేబీ సక్సెస్‌ని ఎంజాయ్ చేశాడు..

అయితే ఈ క్రమంలో శ్రీరెడ్డి తన సోషల్ మీడియా కు పని చెప్పింది. ‘ఓ బేబీ ఫంక్షన్‌కి సమంత మా ఆయనను మాత్రమే పిలిచి కేక్ కట్ చేసింది. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చూసి నేను హర్ట్ అయ్యాను సమంత.

మా ఆయన కోతి వేషాలు చూడండి అంటూ సెన్సేషనల్ కామెంట్ పెట్టి మరోసారి సంచలనం సృష్టించింది. అంతటితో ఆగకుండా అభిరామ్ తో క్లోజ్ గా శ్రీరెడ్డి దిగిన ఫోటోలను కూడా మరోసారి షేర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.