శ్రీ రెడ్డి సినిమా వచ్చేస్తోంది.. మీరు రెడీగా ఉన్నారా?

తెలుగులో ఆమె నటించిన సినిమాలు ఎక్కువ ఏమీ లేవు.ఆమె బుల్లి తెరపై సందడి చేసింది కూడా ఏమీ లేదు.

 Srireddy And Rajendra Prasad Movie Climax On Amazon Prime,latest Tolloywood News-TeluguStop.com

అయినా కూడా ఆమె అంటే చాలా క్రేజ్‌.ఆమె గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది.

ఆమె మరెవ్వరో కాదు వివాదాస్పద ముద్దుగుమ్మ శ్రీరెడ్డి.తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన శ్రీరెడ్డి నటించిన సినిమా క్లైమాక్స్.తన రియల్ లైఫ్ పాత్రను శ్రీరెడ్డి అందులో పోషించింది.రాజేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు.బ్యాంకులకు రుణాలు ఎగవేసి విదేశాలకు వెళ్లి తల దాచుకున్న ఇద్దరు బడా వ్యాపారవేత్తలను ఒక్క పాత్రలో చూపిస్తే ఎలా ఉంటుందో అదే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో చూపించాడు.క్లైమాక్స్ సినిమా పై అందరిలో ఆసక్తి కనబడింది.

కాని ఈనెల 5వ తారీకున సినిమా విడుదల అయితే పెద్దగా జనాలు పట్టించుకున్న దాఖలాలే లేవు.

సినిమా థియేటర్లలో విడుదల అయ్యి నిరాశ పర్చిన శ్రీరెడ్డి క్లైమాక్స్‌ సినిమా మళ్లీ విడుదలకు రెడీ అయ్యింది.

ఈ సినిమాను అమెజాన్ వారు కొనుగోలు చేసి స్ట్రీమింగ్‌ కు ఏర్పాట్లు చేశారు.ప్రేక్షకులు థియేటర్ ల్లో చూడకుంటే అమెజాన్‌ ప్రైమ్‌ లో చూడవచ్చు.వివాదాస్పద సినిమా అయినా కూడా ఇందులో రాజేంద్ర ప్రసాద్‌ నటన అద్బుతం అనడంలో సందేహం లేదు.ఆయన నటించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది.

నిజంగా అద్బుతంగా ఉందంటూ రివ్యూవర్స్ కూడా కామెంట్స్ చేశారు.మొత్తానికి శ్రీరెడ్డి సినిమా డిజిటల్ ప్రపంచంలో రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అంతా చూసేందుకు రెడీ అవ్వడం ఖాయం.

టికెట్‌ రేట్లు పెరిగిన నేపథ్యంలో థియేటర్ కు వెళ్లి ఏం చూస్తాం అనుకున్న వారు ఓటీటీ వచ్చిన వెంటనే చూస్తున్నారు.ఈ సినిమాను కూడా అలాగే చూస్తారని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్ లో ఓపెన్‌ ఈ సినిమా ఓటీటీ లో సక్సెస్ అయ్యేనా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube