శ్రీరస్తు శుభమస్తు మూవీ రివ్యూ

చిత్రం : శ్రీరస్తు శుభమస్తు

 Srirastu Subhamastu Review-TeluguStop.com

బ్యానర్ : గీతా ఆర్ట్స్

దర్శకత్వం : పరశురామ్

నిర్మాత : అల్లు అరవింద్, బన్ని వాసు

సంగీతం : తమన్

విడుదల తేది : ఆగష్టు 5, 2016

నటీనటులు : అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు

అల్లు శిరీష్ హీరోగా పరిచయమై చాలాకాలమైనా, ఇంకా కోరుకున్న సక్సెస్ దొరకలేదు.మరోవైపు దర్శకుడు పరుశరామ్ కూడా సక్సెస్ కోసం చాన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నారు.

తమని తాము నిరూపించుకోవాలనే తాపత్రయం వీరిద్దరిది.మరోపక్క హిట్ ఫామ్ ని ఈ చిత్రంతో కంటిన్యూ చేయాలనే ఆశ గీతా ఆర్ట్స్ ది.ఈ కలయికలో వచ్చింది “శ్రీరస్తు శుభమస్తు”.మరి ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో చూద్దాం.

కథలోకి వెళ్తే …

ఒక పెద్ద బిజినెస్‌ మెన్ కొడుకు శిరీష్ (అల్లు శిరీష్) ఒక బిజినెస్ ట్రిప్ లో అనుకోని విధంగా అనన్య (లావణ్య) ని చూస్తాడు.అనుపై ప్రేమ పెంచుకోవడమే కాకుండా ఆ విషయాన్ని తన తండ్రి (ప్రకాష్ రాజ్) కి చెబుతాడు.

అయితే తన ప్రేమని ఒప్పుకోని తండ్రితో, తాను ఒక ధనవంతుడిగా కాకుండా, మామూలు మనిషిగా అనన్య ప్రేమను గెలుచుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు.

మరి అనన్యతో పాటు అనన్య కుంటుంబానికి శిరీష్ దగ్గరయ్యాడా? చేసిన ఛాలెంజ్ ని గెలుచుకున్నాడా లేదా అనేది మిగితా కథ.

నటీనటుల నటన గురించి

ఇంతకుముందు చేసిన సినిమాలన్నిటిలోకి ఈ సినిమాలో శిరీష్ లుక్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు.దాంతోపాటు ఇంతకుముందు లేని ఈజ్ కూడా సాధించేసాడు శిరీష్.

కామెడి టైమింగ్ కూడా బానే ఇంప్రూవ్ అయ్యింది.అయితే హావభావాలపై ఇంకాస్త పని చేయాల్సిందే.

ఇక లావణ్య త్రిపాఠి ఫర్వాలేనిపించింది.ఇక ఈ సినిమాకి అదనపు బలాన్ని సమకూర్చారు ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్.

మరీ ముఖ్యంగా రావు రమేష్.సినిమా సినిమాకి ఆయన చూపిస్తున్న పరిణితి, విభిన్నత మెచ్చుకోదగ్గవి.

ఆలీ, సుబ్బరాజు కాసేపు నవ్వించారు.

సాంకేతికవర్గం పనితీరు

తమన్ అందించిన సంగీతానికి ఇప్పటికే మంచి స్పందన లభించింది.

ఇక నేపథ్య సంగీతం బాగుంది.మణికందన్ విజువల్స్ సినిమాకి చాలా పెద్ద బలం.ముఖ్యంగా శిరీష్ ని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యింది కెమెరా డిపార్టుమెంటు.ఎడిటింగ్ వైపు కూడా పెద్దగా కంప్లయింట్స్ లేవు.

దమ్ము లేని కథ అయినా, ఎడిటింగ్ నీట్ గానే ఉంది.గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన పని లేదు.

అందులోనూ, కొడుకు శిరీష్ సినిమా కాబట్టి అల్లు అరవింద్ ఖర్చుకి ఏమాత్రం వెనుకాడలేదు.పరశురామ్ అందించిన మాటలు మనకు బాగా గుర్తుండిపోతాయి.

విశ్లేషణ :

ఇప్పటివరకు చూడని కథ కాదు.ఎన్నో సినిమాల్లో ఈ తరహా కథల్ని చూసాం.

పరశురామ్ స్వతహాగా ఒక రచయిత.అందుకే గొప్ప కథ కాకపోయినా, తన పెన్ను పవర్ తో సరదా సన్నివేశాలు, ఎమోషన్స్ మిక్స్ చేసి ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాని నడింపించాడు.

మరీ ముఖ్యంగా అల్లు శిరీష్ నుంచి ఆడియెన్స్ ఊహించని నటన రాబట్టుకోవడంలో పరశురామ్ సఫలమయ్యాడు.కాని ఎప్పుడు ఏం జరగబోతోందో ప్రేక్షకుడు కనిపెట్టే వీలున్న కథ, స్క్రీన్ ప్లే ఎంచుకున్నాడు దర్శకుడు.

అదో మైనస్ పాయింటనే చెప్పుకోవాలి.

మొత్తానికైతే సినిమా బోర్ కొట్టదు.

ఫ్యామిలీతో కలిసి ఓసారి అలా ఈజీగా చూడొచ్చు.ఇటు శిరీష్ కి, అటు పరశురామ్ కి బ్రేక్ ఇచ్చే సినిమా ఇది.

హైలైట్స్ :

* పాత్రలు

* పరశురామ్ రచన

* కామెడి

* సెకండాఫ్

డ్రాబ్యాక్స్ :

* కొత్తదనం లేని కథ

* ప్రేక్షకుడు ఊహించగలిగే సన్నివేశాలు

చివరగా :

చూడదగిన సినిమా.ఆకట్టుకుంటుందా లేదా అనేది పక్కనపెడితే, డిజపాయింట్ అయితే చేయదు.

తెలుగుస్టాప్ రేటింగ్ : 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube