అవకాశం వస్తే తెలుగు సినిమాల్లో నటిస్తానంటున్న శ్రీరామ్?

Sriram Talk About Asalem Jarigindi Movie

గతంలో కొన్ని తెలుగు సినిమాలలో పలు క్యారెక్టర్ లో నటించిన హీరో శ్రీరామ్ కొద్ది కాలం నుంచి పూర్తిగా తెలుగు తెరకు దూరమయ్యారు.ఈ క్రమంలోనే శ్రీ రామ్ హీరోగా సంచిత పదుకొనే హీరోయిన్ గా ఎన్ వీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “అసలేం జరిగింది“.

 Sriram Talk About Asalem Jarigindi Movie-TeluguStop.com

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదల కావడంతో ఈ సినిమా గురించి హీరో శ్రీరామ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా కథను దర్శకుడు రాఘ‌వ (ఎన్‌వీఆర్‌) చెప్పేటప్పుడు కథ వింటూ, కథ ప్రేమలో పడిపోయానని, కథ వినేటప్పుడు ఇది ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్ అని ఇందులో తప్పకుండా నటించాలని భావించినట్లు శ్రీరామ్ తెలిపారు.

 Sriram Talk About Asalem Jarigindi Movie-అవకాశం వస్తే తెలుగు సినిమాల్లో నటిస్తానంటున్న శ్రీరామ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పుడు సినిమాలకు డబ్బింగ్ చెప్పే సమయంలో అలా కాదు ఇలా చెప్పాలని చాలా మంది చెప్పేవారు.అయితే ఈ సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కడంతో డబ్బింగ్ చెప్పడం కూడా ఎంతో సులువుగా ఉందని తెలియజేశారు.

ఈ సినిమా గ్రామీణ ప్రాంతాలలో తెరకెక్కడంతో పలు సన్నివేశాలు కేవలం ఓకే టేక్ లోనే ఓకే అవడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోయారని ఈ సందర్భంగా శ్రీరామ్ తెలిపారు.ఈ క్రమంలోనే మరి కొన్ని తెలుగు చిత్రాలలో నటించాలని కోరినట్లు శ్రీరామ్ తెలిపారు.

తనకు అవకాశం వస్తే తెలుగు సినిమాలలో తప్పకుండా నటిస్తానని ఇలాంటి మంచి కథను తనను నమ్మి తనకు ఈ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్మాత జాన్స‌న్ కు శ్రీరామ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

#Sri Ram #AsalemJarigindi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube