ఆగమవుతున్న ఆగడు డైరెక్టర్  

Srinu Vaitla Struggling To Find Producer - Telugu Bellamkonda Srinivas, Producer, Srinu Vaitla, Telugu Movie News

ఒకప్పుడు వరుస సక్సెస్ చిత్రాలతో టాలీవుడ్‌ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు శ్రీను వైట్ల, గతకొంత కాలంగా ఒక్క హిట్టు కూడా లేక చతికలబడ్డాడు.వైట్ల డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేస్తుండటంతో ఎలాగైనా హిట్టు కొట్టి తీరాలని ప్రయత్నిస్తున్నాడు.

 Srinu Vaitla Struggling To Find Producer

దీని కోసం ఓ కథను యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు వినిపించి ఓకే చేయించుకున్నాడు.

అయితే శ్రీను వైట్లకు ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

ఆగమవుతున్న ఆగడు డైరెక్టర్-Gossips-Telugu Tollywood Photo Image

మంచి కథ రెడీ చేస్తున్న వైట్లకు చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు ఒక్క నిర్మాత కూడా దొరకడం లేదట.బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు కూడా వరుసగా ఫెయిల్ అవుతుండటం, ఫాంలో లేని వైట్లను నమ్మి రిస్క్ చేయలేం అంటూ నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదట.

దీంతో తన సినిమాకు నిర్మాతను దొరికించుకునే పనిలో బిజీగా ఉన్నాడట వైట్ల.

ఈ ఒక్క సినిమాతో ఖచ్చితమైన హిట్ అందుకుని మళ్లీ ఫాంలోకి రావాలని శ్రీను వైట్ల ఆశిస్తున్నాడు.

మరి వైట్లను నమ్మి రిస్క్ చేసే ప్రొడ్యూసర్ ఎక్కడో ఉన్నాడో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Srinu Vaitla Struggling To Find Producer Related Telugu News,Photos/Pics,Images..