ఒక్క ఛాన్స్ ఇస్తే 'దూకుడు' ను మించిన మూవీ ఇస్తాడట.. నమ్మేనా?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు తో దూకుడు వంటి బ్లాక్ బస్టర్‌ సక్సెస్‌ ను తెరకెక్కించిన దర్శకుడు శ్రీను వైట్ల అప్పటి నుండి మళ్లీ సక్సెస్‌ మొహం ఎరుగలేదు.ఎన్టీఆర్‌ తో బాద్‌ షా చరణ్‌ తో బ్రూస్లీ మరియు మహేష్‌ బాబుతో ఆగడు ఇంకా వరుణ్‌ తో మిస్టర్ ఇలా ఎన్నో సినిమా లను చేసినా కూడా దూకుడు తరహాలో కాదు కదా కనీసం సక్సెస్ కూడా కాలేదు.

 Srinu Vaitla Says He Want To Do Dookudu Like Movie With Mahesh Babu, Aagadu , Do-TeluguStop.com

అయినా కూడా శ్రీను వైట్ల తనపై తనకు ఉన్న నమ్మకంను మాత్రం కోల్పోలేదు.ఆయన వరుసగా సినిమాలను చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

ఢీ అండ్‌ ఢీ అనే సినిమా ను ప్రస్తుతం ఈయన చేస్తున్నాడు.బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ సక్సెస ను దక్కించుకున్న దూకుడు సినిమా పేరు చెప్పుకుని ఇన్నాళ్లు కెరీర్‌ ను నెట్టుకు వచ్చిన శ్రీను వైట్ల ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌ లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ ను చేస్తానంటూ ధీమా గా చెబుతున్నాడు.

అది కూడా మహేష్‌ బాబుతో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాడు.

మంచు విష్ణు తో ఢీ అండ్ ఢీ సినిమా ను చేస్తున్న శ్రీను వైట్ల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మహేష్ బాబు మళ్లీ ఆఫర్‌ ఇస్తే తప్పకుండా దూకుడు ను మించిన సినిమా ను చేస్తాను అంటూ ధీమాగా చెబుతున్నాడు.

మహేష్‌ బాబుతో దూకుడు సినిమా ను చేసిన శ్రీను వైట్ల ఆ తర్వాత ఆగడు సినిమా చేశాడు.

Telugu Aagadu, Dookudu, Mahesh Babu, Mister, Srinu Vaitla, Tollywood-Movie

ఆగడు సినిమా మరీ దారుణంగా ప్లాప్ అయ్యింది.మహేష్ బాబును మరీ జోకర్ గా చూపించే ప్రయత్నం చేశాడు.అలాంటి సినిమాను చేసినందుకు మహేష్‌ బాబు మళ్లీ ఆఫర్‌ ఇస్తాడా అంటే ఖచ్చితంగా ఇవ్వడు.

కనుక శ్రీనువైట్ల చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా సఫలం అవ్వదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube