ఎట్టకేలకు హీరో దొరికాడోచ్!  

Srinu Vaitla Next Movie With Manchu Vishnu - Telugu Dhee Sequel, Manchu Vishnu, Srinu Vaitla, Telugu Movie News

ఒకప్పుడు టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ సినిమాలకు కేరాఫ్‌గా మారి వరుసబెట్టి సినిమాలు చేసిన దర్శకుడు శ్రీను వైట్ల.స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు సినిమాలు చేసి హిట్ అందుకున్న ఈ డైరెక్టర్, ఆగడు సినిమా తరువాత ఆగమైపోయాడు.

 Srinu Vaitla Next Movie With Manchu Vishnu

ఇక ఆ సినిమా తరువాత చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలవడంతో, ఇప్పడు శ్రీను వైట్లతో సినిమా అంటేనే హీరోలు భయపడుతున్నారు.

ఇక ఆయన కెరీర్‌లో మంచి విజయాన్ని అందించిన మూవీ ‘ఢీ’కు రీమేక్ ఖచ్చితంగా ఉంటుందని ఎప్పుడో ప్రకటించిన శ్రీను వైట్ల, ఇప్పుడు ఆ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఎట్టకేలకు హీరో దొరికాడోచ్-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాలో హీరో కోసం గతకొంత కాలంగా వెతుకుతున్నాడు.కానీ ఎవరూ కూడా వైట్లకు ఓకే చెప్పలేదు.దీంతో ఢీ చిత్రంలో నటించిన మంచు విష్ణుకు ఢీ సీక్వెల్ మూవీకి సంబంధించిన కథను వైట్ల వినిపించాడట.

కాగా కథ నచ్చిన మంచు విష్ణు ఢీ సీక్వెల్ చేసేందుకు ఓకే చెప్పాడట.

ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.మరి మంచు విష్ణుతోనైనా శ్రీను వైట్ల సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు