కెరీర్‌లో ఆ తప్పు చేశా.. అందుకే ఇలా అయిపోయా: శ్రీను వైట్ల

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఢీ, రెడీ, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను పరిచయం చేసిన దర్శకుడు శ్రీనువైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు దర్శకుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీనువైట్ల ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 Srinu Vaitla Dukudu Movie Dhee Movie Srinu Vaitla Latest Interview Movies-TeluguStop.com

ప్రస్తుతం తన దగ్గర ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయని అయితే వాటిలో నటించడం కోసం హీరోలు ముందుకు రావడంలేదని శీను వైట్ల తెలియజేశారు.తాజాగా మహేష్ బాబు హీరోగా నటించినటువంటి దూకుడు చిత్రం 10 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా శీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ దూకుడు సినిమా అద్భుతమైన విజయం అందుకున్న తర్వాత నానుంచి దూకుడు సినిమాకు మించి కామెడీని ఎక్స్పెక్ట్ చేయటం వల్లే నాకు సరైన హిట్ సినిమాలు దక్కడం లేదు.ప్రేక్షకులు నామీద పెట్టుకున్న అంచనాలను తాకే కథలను ఎంపిక చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆ తప్పు చేయటం వల్లే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని శ్రీనువైట్ల తెలిపారు.

 Srinu Vaitla Dukudu Movie Dhee Movie Srinu Vaitla Latest Interview Movies-కెరీర్‌లో ఆ తప్పు చేశా.. అందుకే ఇలా అయిపోయా: శ్రీను వైట్ల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపై ఈ తప్పు చేయనని ట్రెండ్ కి తగ్గ సినిమాలనే ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు.

శీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు నటించినటువంటి ఢీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఢీ అంటే ఢీ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని తెలిపారు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందని ఈ సందర్భంగా శ్రీను వైట్ల వెల్లడించారు.

#Dukudu #Interview #Srinu Vaitla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు