ఇలియానా పేరు జపిస్తున్న ఫ్లాప్ డైరెక్టర్!  

ఇలియానా మళ్ళీ కావాలంటున్న శ్రీను వైట్ల. .

Srinu Vaitla Concentrate On Ileana-

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి ఇలియానా. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన ఈ భామకి ఊహించని విధంగా హిందీలో అవకాశం రావడంతో అక్కడికి జంప్ అయిపొయింది. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీకి మొహం చాటేసింది..

ఇలియానా పేరు జపిస్తున్న ఫ్లాప్ డైరెక్టర్! -Srinu Vaitla Concentrate On Ileana

అలాగే తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ లకి, ప్రేక్షకులకి తన నడుము మీద ఉన్నంత మోజు యాక్టింగ్ మీద లేదని, అందుకే టాలీవుడ్ ని వదిలేసినట్లు కబుర్లు చెప్పుకొచ్చింది. అయితే బాలీవుడ్ లో తనని నెత్తిన పెట్టుకుంటారని భావించిన అక్కడ ఊహించని ఎదురుదెబ్బ ఇలియానాకి తగిలింది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించిన అనుకున్న స్థాయిలో ఆమెకి అవకాశాలు రాలేదు.

అలాగే అక్కడ తన అందాల ప్రదర్శన హద్దులు చెరిపేసిన కూడా దర్శకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి టైంలో దర్శకుడు శ్రీనువైట్ల మళ్ళీ ఏరి కోరి ఇలియానాకి తెలుగులో అవకాశం ఇచ్చాడు. ఆమె బ్యాడ్ లుక్ కొద్ది రవితేజతో కలిసి చేసిన ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

అయిన కూడా శ్రీనువైట్ల తన నెక్స్ట్ సినిమా అయిన డీ సీక్వెల్ కోసం మళ్ళీ ఇలియానాని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి అతని ప్రయత్నంకి ఇలియానా ఎంత వరకు అండగా ఉంటుంది అనేది చూడాలి.